రేపటి నీట్ పరీక్షకు నిబంధనలు మరింత కఠినతరం
మెడికల్, డెంటల్ యూజీ కోర్సులో చేరేందుకు జాతీయ స్థాయిలో మే 6న నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్టు) పరీక్షకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా 13.36 లక్షల మంది హాజరవుతున్న ఈ పరీక్షకు ఆంధ్ర, తెలంగాణ నుంచి 2.5 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఆంధ్రలో 9, తెలంగాణలో 4 రీజనల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్ష ఇంగ్లీషు, హిందీతో పాటు తెలుగు, తమిళం, మరాఠీ, గుజరాతీ, కన్నడ, ఒడిస్సా, బెంగాలీ, అస్సామీ భాషల్లోనూ నిర్వహించనున్నారు. రెండున్నర గంటలముందే పరిక్షా కేంద్రాలకు చేరుకోవాలని.. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జరుగుతుందని, విద్యార్థులు మాత్రం ఉదయం 7.30కే చేరుకోవాలని అధికారులు సూచించారు. నీట్ పరీక్షకు ముందుగానే అనుమానిత కేంద్రాల్లో జామర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
హైదరాబాద్: మెడికల్, డెంటల్ యూజీ కోర్సులలో చేరేందుకు జాతీయ స్థాయిలో మే 6న నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు) పరీక్షకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా 13.36 లక్షల మంది హాజరవుతున్న ఈ పరీక్షకు ఆంధ్ర, తెలంగాణ నుంచి 2.5 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఆంధ్రలో 9, తెలంగాణలో 4 రీజనల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్ష ఇంగ్లీషు, హిందీతో పాటు తెలుగు, తమిళం, మరాఠీ, గుజరాతీ, కన్నడ, ఒడిస్సా, బెంగాలీ, అస్సామీ భాషల్లోనూ నిర్వహించనున్నారు. రెండున్నర గంటలముందే పరిక్షా కేంద్రాలకు చేరుకోవాలని.. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జరుగుతుందని, విద్యార్థులు మాత్రం ఉదయం 7.30కే చేరుకోవాలని అధికారులు సూచించారు. నీట్ పరీక్షకు ముందుగానే అనుమానిత కేంద్రాల్లో జామర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నిబంధనలు మరింత కఠినతరం:
నీట్-2018కు హాజరయ్యే విద్యార్ధినీ విద్యార్థులకు సీబీఎస్‌ఈ డ్రెస్ కోడ్ సూచించింది. ఖచ్చితంగా లేత రంగులో ఉండే హాల్ స్లీవ్ దుస్తులనే వేసుకోవాలని, బూట్లు ధరించరాదని నిబంధన విధించింది.
- సల్వార్లు, ట్రౌజర్‌లపై పెద్ద బాటమ్స్ ఉండకూడదు
- బూట్లు, హైహిల్స్ వేసుకోకూడదు, అలాగే ఆభరణాలు ధరించకూడదు
- గడియారం, బ్రేస్‌లెట్ వంటి లోహ వస్తువులను తీసుకురాకూడదు
- స్టేషనరీ, కమ్మ్యునికేషన్ గ్యాడ్జెట్లు కూడా తీసుకురాకూడదు.
- ఆభరణాలు భద్రపరిచేందుకు పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు ఉండవు. కనుక ఇంటివద్దే ఉంచడం ఉత్తమం.
కాగా.. నీట్ పరీక్షకు హాజరయ్యే సిక్కు విద్యార్థులకు ఢిల్లీ హైకోర్టు ఊరట కల్పించింది. నీట్ పరీక్ష కేంద్రంలోకి తలపాగా, కిర్పాణ్ (కత్తి వంటిది) తీసుకువెళ్లవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. అటు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం బయట రాష్ట్రాల్లో నీట్ పరీక్ష రాసే 1500 మంది విద్యార్థులకు సెకండ్ క్లాస్ ట్రైన్ టిక్కెట్లను రూ.1000కే ఇస్తామని ప్రకటించింది.