NEET PG 2021 exam వాయిదా వేయాల్సిందిగా అభ్యర్థుల డిమాండ్.. ట్విటర్‌లో Postponeneetpg ట్రెండింగ్
NEET PG 2021 exam postponement: నీట్ పీజీ ఎగ్జామ్‌కి మరో మూడు రోజులే మిగిలి ఉందనగా నీట్ పీజీ అభ్యర్థులు పీజీ పరీక్ష వాయిదా వేయాలని కోరుకుంటూ ట్విటర్ ద్వారా సంబంధిత అధికార యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు. ఇప్పటికే CBSE 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ రద్దు కాగా CBSE 12వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో నీట్ పీజీ పరీక్షలు కూడా సీబీఎస్ఈ పరీక్షలు తరహాలోనే వాయిదా వేయాలని NEET PG 2021 అభ్యర్థులు పట్టుబడుతున్నారు.
NEET PG 2021 exam postponement: నీట్ పీజీ ఎగ్జామ్‌కి మరో మూడు రోజులే మిగిలి ఉందనగా నీట్ పీజీ అభ్యర్థులు పీజీ పరీక్ష వాయిదా వేయాలని కోరుకుంటూ ట్విటర్ ద్వారా సంబంధిత అధికార యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు. కొవిడ్-19 కేసులు భారీగా పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో నీట్ పీజీ పరీక్షలకు హాజరవడం ఇబ్బందికరమైన పరిణామమే అవుతుందని, అందుకే నీట్ పీజీ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ట్విటర్‌లో #Postponeneetpg అనే హ్యాష్‌ట్యాగ్‌తో నీట్ అభ్యర్థులు చేస్తున్న ట్వీట్స్ ట్రెండ్ అవుతున్నాయి.
ఏప్రిల్ 14నే నీట్ పీజీ పరీక్షల అడ్మిట్ కార్డ్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి వచ్చాయి. ఏప్రిల్ 18 నుంచి నీట్ పీజీ పరీక్షలు (NEET PG 2021 exam) ప్రారంభం కానుండగా అంతకంటే ముందే పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు కొద్దిరోజుల క్రితమే కొంతమంది విద్యార్థులు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE)కి లేఖలు రాశారు.
NEET PG 2021 exam కోసం 1,74,886 మంది అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE) మాత్రం ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి అడ్మిట్ కార్డ్స్ కూడా విడుదల చేసింది. కరోనావైరస్ పాజిటివ్ కేసులు (COVID-19 cases) భారీగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో అనేక రాష్ట్రాల్లో బోర్డ్ ఎగ్జామ్స్ వాయిదా పడటం లేదా రద్దు కావడం జరుగుతోంది.
Also read : Samsung Galaxy F02s: శాంసంగ్ గెలాక్సీ F02s తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్
CBSE 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ రద్దు కాగా CBSE 12వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో నీట్ పీజీ పరీక్షలు కూడా సీబీఎస్ఈ పరీక్షలు తరహాలోనే వాయిదా వేయాలని NEET PG 2021 అభ్యర్థులు పట్టుబడుతున్నారు. ఈ మేరకు కొంతమంది అభ్యర్థులు కేంద్ర హోంశాఖను ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు.
మరో ట్విటర్ యూజర్ స్పందిస్తూ.. ''ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నీట్ పీజీ పరీక్షలకు హాజరవడం అంటే అది తమనే కాదు తమ కుటుంబాన్ని సైతం ప్రమాదంలో పడేయడమే అవుతుందని, ఇప్పటికే పరిస్థితి చేయిదాటిపోతోంటే ఈ పరీక్షలు నిర్వహించి పరిస్థితి తీవ్రతను ఎందుకు పెంచడం'' అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
సీబీఎస్ఈ తరహాలోనే కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ కూడా సీఐఎస్‌సీఈ బోర్డు పరీక్షల (CISCE board exams) విషయంలో నిర్ణయం తీసుకుంటుందేమోనని CISCE students వేచిచూస్తున్నారు. సీఐఎస్సీఈ కూడా ప్రస్తుత కొవిడ్-19 (COVID-19 cases) పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also read : CBSE 10th Exams 2021: సీబీఎస్ఈ పరీక్షల్ని రద్దు చేసిన కేంద్రం, పాస్ ఎలాగంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook