NEET PG Exam Postponement 2023: నీట్ 2023 వాయిదా.. సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంట!
NEET PG 2023 Postponement Latest Update: NEET PG 2023 పరీక్షను వాయిదా వేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు కాసేపట్లో విచారణ జరుపనుంది. NEET PG 2023 పరీక్ష వాయిదాకు అవసరమైన తాజా అప్డేట్స్ మీ కోసం
NEET PG 2023 Postponement Live updates: నేడు అంటే ఫిబ్రవరి 27న, NEET PG 2023 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు కొద్దిసేపట్లో విచారించనుంది. మార్చి 05న జరగాల్సిన నీట్ పీజీ 2023 పరీక్షను వాయిదా వేయాలని పిటిషనర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సెషన్‌లో నీట్ పీజీ పరీక్షకు సంసిద్ధం కావడానికి తగినంత సమయం లేదని విద్యార్థులు వాదిస్తున్నారు. అయితే ఈ డిమాండ్ల నేపధ్యంలోనే ఇటీవల, కేంద్రం నీట్ పీజీ ఇంటర్న్‌షిప్ కటాఫ్ తేదీని పెంచింది. గతంలో విచారణ జరిగిన సమయంలో 2.09 లక్షల మంది విద్యార్థులు నీట్ పీజీ కోసం నమోదు చేసుకున్నారని, ఒకవేళ పరీక్ష వాయిదా పడితే, పరీక్ష నిర్వహణ తేదీ సమీప భవిష్యత్తులో అందుబాటులో ఉండకపోవచ్చని నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
ఇక ఈరోజు తీసుకునే నిర్ణయం తర్వాత, మార్చి 05న NEET PG 2023 పరీక్ష నిర్వహించబడుతుందా లేదా అనేది స్పష్టమవుతుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్‌బీఈ)కి కొంత సమాచారం అందించి పరిష్కారాన్ని ప్రతిపాదించాల్సిందిగా కోర్టు ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఫిబ్రవరి 24న, భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) DY చంద్రచూడ్ మరియు జస్టిస్ S రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం తాము ఏ విధంగానూ ఎటువంటి ఉత్తర్వును జారీ చేయడం లేదని, తదుపరి విచారణ తేదీ వరకు ఈ సమస్యను తెరిచి ఉంచామని స్పష్టంగా పేర్కొన్న క్రమంలో ఏమి జరగనుంది అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
గత విచారణలో
నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET)-PG ఎగ్జామ్ కి సంబంధించి పిటిషనర్లు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించాలని NBE తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని సుప్రీంకోర్టు బెంచ్ కోరింది. మేము ఇప్పుడు ఈ పరీక్షను వాయిదా వేస్తే, దాని కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు బాధ కలుగుతుందేమో అని బెంచ్ అనుమానం వ్యక్తం చేసింది.
నిజానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మార్చి 05, 2023న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్, NEET PG 2023ని నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. సుప్రీంకోర్టు విచారణ ఒక పక్క జరుగుతుండగా మరోపక్క NBE ఈరోజు NEET PG అడ్మిట్ కార్డ్ 2023ని అధికారిక వెబ్‌సైట్ nbe.edu.inలో విడుదల చేయబోతోంది.
ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతోంది..
Also Read: NEET PG 2023 Postponement: నీట్ పీజీ 2023 వాయిదా డిమాండ్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
Also Read: 7th pay Commission News: 7వ పే కమిషన్ అమలు చేయకపోతే నిరవధిక ధర్నా.. ఉద్యోగ సంఘాల వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి