NEET PG 2023 Postponement: నీట్ పీజీ 2023 పరీక్ష వాయిదా వేయాలంటూ దేశవ్యాప్తంగా ఒక డిమాండ్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై కొంతమంది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 5న నీట్ పీజీ 2023 పరీక్ష జరగాల్సి ఉండగా.. ఆ పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా కోరుతూ ఇప్పటికే సుప్రీం కోర్టులో పలు పిటిషన్స్ దాఖలయ్యాయి. ఈ పిటిషన్స్ పై నేడు విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్.ఆర్. భట్, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తరపున అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తమ వాదనలు వినిపిస్తూ.. మార్చి 5న జరగనున్న నీట్ పీజీ 2023 పరీక్ష కోసం 2.09 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని.. పరీక్ష కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు. అన్నింటికిమించి ఈ పరీక్ష నిర్వహణ కోసం టెక్నాలజీ పార్టనర్‌తోనూ టయప్ అయిన విషయాన్ని కోర్టుకు విన్నవించారు. ఈ దశలో పరీక్ష వాయిదా వేస్తే రాబోయే ఇంకొన్ని రోజుల పాటు పరీక్షనిర్వహించేందుకు మరో ప్రత్యామ్నాయ మార్గం కనిపించడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
మరోవైపు పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర్ నారాయణన్ వాదనలు వినిపిస్తూ.. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు 13 మంది మాత్రమే కావొచ్చు కానీ వాళ్లు 45 వేల మంది అభ్యర్థుల డిమాండ్ ని కోర్టు దృష్టికి తీసుకొస్తున్నారని అన్నారు. పిటిషనర్ల సంఖ్య తక్కువే అయినప్పటికీ.. నీట్ పీజీ ఎగ్జామ్ 2023 వాయిదా వేయాలన్న డిమాండ్ మాత్రం దాదాపు 45 వేల మంది వాయిస్ అని అన్నారు. మరో సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహ్తగీ కోర్టు ఎదుట పిటిషనర్ల తరపున వాదనలు వినిపిస్తూ.. ఇంటర్న్ షిప్ విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన షెడ్యూల్స్ ఉన్నాయని.. అందువల్లే సమస్య తలెత్తుతోందని అన్నారు.
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తరపున ఐశ్వర్య భాటి, పిటిషనర్ల తరపున గోపాల్ శంకర్ నారాయణన్, ముకుల్ రోహ్తగి వాదనలు విన్న కోర్టు.. పిటిషనర్ల డిమాండ్ తో ఏకీభవిస్తూ పరీక్ష వాయిదా వేస్తే.. నీట్ పీజీ పరీక్ష 2023 కోసం నెలల తరబడి సన్నద్ధం అవుతూ వచ్చిన వారు మానసికంగా ఆందోళనకు గురవుతారని వ్యాఖ్యానించింది. అలాగని పిటిషనర్ల వాదనతో ఏకీభవించడం లేదని కూడా అనడం లేదన్న కోర్టు.. ఈ సమస్యపై తగిన సూచనలతో రావాల్సిందిగా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కి ఆదేశాలు జారీచేస్తూ ఫిబ్రవరి 27కి తరువాతి విచారణను వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి : PM Kisan Yojana 2023: పీఎం కిసాన్ స్కీమ్ అప్‌డేట్.. అకౌంట్‌లోకి డబ్బులు ఎప్పుడంటే..?
ఇది కూడా చదవండి : Who is Ajay Banga: వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ పోస్టుకు భారత సంతతి వ్యక్తి అజయ్ బంగ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook