NEET Exam Switch to Online: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ 2024 పరీక్ష విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు కన్పిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా నీట్‌పై ఆరోపణలు, అవకతవకలు, పేపర్ లీకేజ్, సీబీఐ దర్యాప్తు, ఎన్టీఏ మనుగడపై ప్రశ్నలు రావడంతో నీట్ పరీక్ష విధానం మారవచ్చని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NEET 2024లో ఈసారి చాలా అవకతవకలు జరిగాయి. పేపర్ లీకయ్యింది. గ్రేస్ మార్కుల వ్యవహారంపై సుప్రీంకోర్టు మండిపడటంతో అవి కాస్తొ తొలగించి కొందరికి రీ నీట్ నిర్వహించారు. ఈలోగా పేపర్ లీకేజ్ బయటపడింది. మరోవైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే యూజీసీ నెట్ పరీక్ష పత్రం లీక్ కావడంతో పరీక్ష రద్దయింది. నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. నీట్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటీషన్లపై విచారణ జరుగుతోంది. పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్షాలు ఇదే అంశంపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకూ ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతున్న నీట్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. నీట్ సమగ్రతను కాపాడేందుకు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ఇదే అంశంపై గత వారం మూడుసార్లు ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇప్పటికే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నందున నీట్ పరీక్షను కూడా అదే విధంగా జరిపించాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. 


వాస్తవానికి 2018లో అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ నీట్ పరీక్షను 2019 నుంచి ఆన్‌లైన్ విధానంలో రెండు సార్లు జరిపిస్తామని ప్రకటించారు. కానీ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిరాకరించడంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు నీట్‌పై ఆరోపణలు, స్కామ్, పేపర్ లీకేజ్ కారణాలతో మరోసారి ఈ విషయం చర్చకు వచ్చింది. ఆన్‌లైన్ విధానంలో నీట్ పరీక్ష నిర్వహిస్తే పేపర్ లీకేజ్ వంటి ఘటనలు జరగవనేది సీనియర్ల అభిప్రాయంగా ఉంది. 


వాయిదా పడిన నీట్ పరీక్షలు ఎప్పుడంటే


సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొత్త తేదీ ప్రకటించింది. యూజీసీ నెట్ సీఎస్ఐఆర్ పరీక్ష జూలై 25 నుంచి జూలై 27 వరకూ జరుగుతుంది. యూజీలీ నెట్ పరీక్ష ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 8 వరకూ జరుగుతుంది. ఇక నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ను జూలై 10 నుంచి నిర్వహించనున్నారు. నీట్ పీజీ పరీక్ష తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.


Also read: Password Mistakes: అలాంటి పాస్‌వర్డ్ పెడితే అంతే సంగతులు, అసలు పాస్‌వర్డ్ ఎలా ఉండాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook