Password Mistakes: అలాంటి పాస్‌వర్డ్ పెడితే అంతే సంగతులు, అసలు పాస్‌వర్డ్ ఎలా ఉండాలి

Password Mistakes: దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ సైబర్ క్రైమ్ వార్తలు పెరిగిపోతున్నాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిన తరువాత సైబర్ మోసాలు మరింతగా పెరిగాయి. ఫోన్ పాస్‌వర్డ్‌లు కూడా బ్రేక్ చేసేస్తున్నారు. ఈ క్రమంలో పాస్‌వర్డ్‌లకు సంబంధించి కీలకమైన సూచనలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 1, 2024, 07:42 AM IST
Password Mistakes: అలాంటి పాస్‌వర్డ్ పెడితే అంతే సంగతులు, అసలు పాస్‌వర్డ్ ఎలా ఉండాలి

Password Mistakes: స్మార్ట్‌ఫోన్ వినియోగించేవాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే సైబర్ నేరగాళ్లకు బలయిపోవల్సి వస్తుంది. అందుకే అన్నింటికంటే ప్రధానంగా తీసుకోవల్సిన జాగ్రత్త ఫోన్ పాస్‌వర్డ్ విషయంలో. ఈ నేపధ్యంలో ఎలాంటి పాస్‌వర్డ్‌లు ఉండాలి. ఎలాంటివి ఉండకూడదో తెలుసుకుందాం.

సైబర్ నేరాల్ని అరికట్టాలంటే ప్రధానంగా స్మార్ట్‌ఫోన్ పాస్‌వర్డ్ బలంగా ఉండాలి. చాలామంది గుర్తుండాలనే ఉద్దేశ్యంతో సులభమైన పాస్‌వర్డ్‌లు 1234 లేదా 0000 వంటివి సెట్ చేస్తుంటారు. లేదా పుట్టిన తేదీలు, పెళ్లి రోజు ఇలా కొన్ని పాపులర్ తేదీల్ని పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల హ్యాకర్లు సులభంగా మీ పాస్‌వర్డ్ బ్రేక్ చేయగలరు. హ్యాకర్లు సులభంగా క్షణాల్లో బ్రేక్ చేయగలిగే 10 పాస్‌వర్డ్‌లు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. పాస్‌వర్డ్ అనేది ఎప్పుడూ సులభంగా ఉండకూడదు. యూనిక్‌గా ఉండాలి. హ్యాకర్ అంచనాలకు అందకుండా ఉండేట్టు చేయాలంటే యూనిక్‌గా ఉండక తప్పదు.

సులభంగా బ్రేక్ చేయగలిగే 10 కామన్ పాస్‌వర్డ్‌లు

సైబర్ సెక్యూరిటీపై చేసిన ఓ అధ్యయనం ప్రకారం చాలామంది పాస్‌వర్డ్ కోసం సులభమైన ప్యాటర్న్ వినియోగిస్తుంటారు. ఈ అధ్యయనంలో దాదాపుగా 3.4 మిలియన్ల మంది పిన్స్ చెక్ చేస్తే అందులో మెజార్టీ కామన్ పాస్‌వర్డ్‌లు ఉన్నాయి. వాటిలో 1234, 1111, 0000, 1212, 7777, 1004, 2000, 4444, 2222, 6969, 9999 వంటివి ఉన్నాయి. కేవలం గుర్తుండాలనే ఉద్దేశ్యంతో ఈ తరహా పాస్‌వర్డ్‌లు ఎంచుకుంటుంటారు. వీటిని హ్యాకర్లు చాలా సులభంగా కనిపెట్టగలరు. అందుకే ఫోన్ పాస్‌వర్డ్ యూనిక్‌గా ఉండేలా చూసుకోవాలి.

యూనిక్ పాస్‌వర్డ్‌లు

ఫోన్ పాస్‌వర్డ్ లేదా బ్యాంకు లావాదేవీల పాస్‌వర్డ్ లేదా యూపీఐ పిన్ ఇలాంటివాటికి ఎప్పుడూ యూనిక్ పాస్‌వర్డ్‌లు ఉండాలి. అప్పుడే హ్యాకర్లకు బలి కాకుండా ఉండగలరు. ఓ అధ్యయనం ప్రకారం కొన్ని యూనిక్ పాస్‌వర్డ్‌లను పరిశోధకులు గుర్తించారు. వీటిలో 8557, 8438, 9539, 7063,  6827, 0859, 6793, 0738, 6835, 8093 ఉన్నాయి. 

పాస్‌వర్డ్ ఎంపికలో ఎలాంటి తప్పులు చేయకూడదు

సులభమైన పదాలు లేదా అక్షరాలతో పాస్‌వర్డ్ ఉండకూడదు. పాస్‌వర్డ్ ఎప్పుడూ 8 కంటే ఎక్కువ క్యారెక్టర్స్‌తో ఉండాలి. పాస్‌వర్డ్‌లో మీ పేరు, పుట్టిన తేదీ ఉండకూడదు. యూజర్ నేమ్‌ను పాస్‌వర్డ్‌గా ఉంచకూడదు. పిన్ జనరేట్ చేసేటప్పుడు కారు లేదా బైక్ నెంబర్ లేదా వెడ్డింగ్ రోజు వినియోగించకూడదు. పాస్‌వర్డ్‌ను మరొకరిని అడగకూడదు. మీ డేటా సురక్షితంగా ఉండేందుకు పాస్‌వర్డ్ కాకుండా పాస్ ఫ్రేజ్ వాడాలి. పాస్‌వర్డ్‌లో ఎప్పుడూ ఆల్ఫా న్యూమరిక్ అండ్ కేరక్టర్ కాంబినేషన్ ఉండాలి. 

Also read: FD Interest Rates: ఒక ఏడాది ఎఫ్‌డీపై ఏ బ్యాంకులో ఎంత వడ్డీ వస్తుందో చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News