Neet paper leakage row students leaders call for band: దేశంలో నీట్ పేపర్ లీకేజ్ రచ్చ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే లీకేజ్ ఘటనలపై కేంద్రం దీన్ని సీరియస్ గా తీసుకుంది. నీట్ ఎగ్జామ్ ను రద్దు చేసిన విషయం తెలిసిందే. నీట్ లేకేజీ వల్ల.. అమూల్యమైన తమ సమయాన్ని కొల్పోయామని విద్యార్థులు ఇప్పటికే బహిరంగంగా తమ నిరసనలు తెలియజేస్తున్నారు. ఎగ్జామ్ ల కోసం సీరియస్ గా చదివిన విద్యార్థులు.. ఇలా లీకేజీ వల్ల తాము ఒత్తిడికి గురౌతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ లు తరచుగా లీక్ లు అయిన ఘటనలు గతంలో పలుమార్లు వార్తలలో నిలిచాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more:Snake bite: ఇదేం విడ్డూరం.. నెల వ్యవధిలో 5 సార్లు కాటేసిన పాము.. స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు..


రైల్వేలు, కొన్నిరాష్ట్రాలలో పోలీస్ జాబ్ లకు నిర్వహించే ఎగ్జామ్ లు సైతం లీక్ అయిన ఘటనలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. దీనిపైన అధికారులు, ఎగ్జామ్ ల నిర్వహణ సిబ్బందిపూర్తిగా నెగ్లెజెన్సీగా ఉంటున్నారని కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దేశంలో ఇప్పటికే అనేక  రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నీట్ వివాదంపై కేంద్ర విద్యాశాఖలకు బహిరంగంగా లేటర్ లు రాశారు. పార్లమెంట్ లో సైతం.. నీట్ వివాదంపై నేతలు మోదీపై ప్రశ్నలు సంధిస్తున్నారు. నీట్ ఎగ్జామ్ ను సైతం సరిగ్గా నిర్వహించలేని పరిస్థితుల్లో ఉందంటూ కూడా అపోసిషన్ లీడర్ కేంద్ర విద్యాశాఖపై మండిపడుతున్నారు.


ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ లను నిర్వహణలో ఇంతటి ఘోరమైన వైఫల్యాలు ఉండటమేంటని విద్యార్థులు ఫైర్ అవుతున్నారు. నీట్ కు ముందు కొందరు ఎగ్జామ్ పేపర్ ను కొందరికి లీక్ చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే అనేక విద్యార్థి సంఘాలు తమ నిరసనలను తెలియజేస్తున్నాయి. ఎస్ఐఎఫ్, ఎఐఎస్ఎఫ్, పీడీఎస్ యూ, పీడీఎస్ఓ, ఎన్ఎస్ యూఐ సంఘాలు సైతం.. నీట్ కు వ్యతిరేకంగా తమ నిరసలను తెలియజేస్తున్నారు. దీని వెనుకాల ఉన్న వారిని కఠినంగా పనిష్మెంట్ చేయాలని, వెంటనే దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కూడా విద్యార్థి సంఘాల నేతల డిమాండ్ చేస్తున్నారు.


Read more: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..


దీనిలో భాగంగానే రేపు (జులై 4) న దేశ వ్యాప్తంగా బంద్ కు విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా స్కూళ్లు, కాలేజీలు బంద్ కు పిలుపునిచ్చారు. దీనిలో విద్యార్థులు, కాలేజీల స్టూడెంట్ లు భారీ ఎత్తున పాల్గొని తమ నిరసనలు తెలియజేయాలని కోరారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి