Netaji statue: స్వాతంత్ర్య పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి (జనవరి 23) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా గేట్ వద్ద ఆయన హోలో గ్రామ్​ విగ్రహాన్ని (Netaji hologram statue) ఆవిష్కరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ హోలో గ్రామ్​ (బీమ్​ లైట్లతో ఏర్పాటు చేసే 3డీ ఇమేజ్​) ఆవిష్కరణ (What is hologram statue) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా.. కేంద్ర మంత్రులు అమిత్​షా, హర్దీప్​సింగ్ పూరీలు నేతాజీకి ఘన నివాళులర్పించారు.


ఈ విగ్రహం 28 అడుగుల ఎత్తు, 7.5 అడుగుల వెడల్పు ఉంటుంది. 30 వేల ల్యూమెన్స్​ స్థాయి ప్రకాశవంతమైన 4కే ప్రొజెక్టర్​ ద్వారా ఈ విగ్రహం (Netaji hologram statue details) కనిపిస్తుంది. 


ఇవే కొలతలతో.. ఈ హోలో గ్రామ్​ విగ్రహం స్థానంలో గ్రానైట్​తో చేసిన పూర్తి స్థాయి విగ్రహం ఏర్పాటు (Netaji statue at India gate) చేయనున్నారు.


గ్రానైట్​ విగ్రహం ఏర్పాటు చేసే వరకు.. ఈ హోలోగ్రామ్​ విగ్రహం అక్కడ ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆ విగ్రహం ప్రజస్వామ్య విలువలను చాటి చెప్పడం సహా భావి తరాలకు స్పూర్తిగా నిలుస్తుందని (PM Modi on Netaji statue) వివరించారు.


ఈ సందర్భంగా నేతాజీ సేవలను, ఆయన చూపిన స్వాతంత్ర్య  పోరాట తెగువను గుర్తు చేసుకున్నారు ప్రధాని. పోరాడి స్వతంత్ర్యం తెచ్చుకోవాలనే ఆయన ఎప్పుడు భావించినట్లు తెలిపారు. బ్రిటీషర్లకు తల వంచడాన్ని ఆయన తిరస్కరించే వారని మోదీ చెప్పుకొచ్చారు.


Also read: Punjab Elections: మా మంత్రిని త్వరలో ఈడీ అరెస్ట్​ చేస్తుంది: అరవింద్ కేజ్రివాల్​


Also read: Arunachal Missing Boy: ఎట్టకేలకు అతని ఆచూకీ లభ్యం.. భారత్‌కు అప్పగిస్తామన్న చైనా ఆర్మీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook