Punjab Elections: మా మంత్రిని త్వరలో ఈడీ అరెస్ట్​ చేస్తుంది: అరవింద్ కేజ్రివాల్​

Punjab Elections: పంజాబ్​ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు చురుగ్గా మారాయన్నారు ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రివాల్​. ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ.. బీజేపీపై విమర్శలు గుప్పించారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2022, 07:20 PM IST
  • బీజేపీపై అరవింద్ కేజ్రివాల్ విమర్శలు
  • తమ నేతలపై త్వరలో ఈడీ దాడులు జరుగుతాయని జోస్యం
  • పక్కా సమాచారం అందిందని వెల్లడి
Punjab Elections: మా మంత్రిని త్వరలో ఈడీ అరెస్ట్​ చేస్తుంది: అరవింద్ కేజ్రివాల్​

Punjab Elections: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్​ బీజీపీపై మరోసారి విమర్శలు చేశారు. పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి కేంద్ర ప్రభుత్వం.. ఈడీని రంగంలోకి దించనున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. పంజాబ్ ఎన్నికల్లో ఆప్​ పోటీ చేస్తున్న విషయం (Arvind Kejriwal fire on BJP) తెలిసిందే.

తమ పార్టీ నాయకుడు, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సంత్యేంద్ర జైన్​పై మరోసారి ఈడీ అధికారులు డాదులు చేసి.. అరెస్ట్ చేస్తారనే సమాచారం వచ్చినట్లు పేర్కొన్నారు అరవింద్ (Satyendar Jain arrest) కేజ్రివాల్​.

అయితే గతంలో కూడా రెండు సార్లు సత్రేంద్ర జైన్​పై ఇలాంటి దాడులు జరిగినా.. ఎలాంటి విషయాలు కనుగొనలేదన్నారు. ఈ సారి కూడా వాళ్లకు స్వాగతం అంటూ.. కేజ్రివాల్​ (Arvind Kejriwal దల ED) సెటైర్ వేశారు.

గతంలో 2018లో సీబీఐ.. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్రేంద్ర జైన్​ ఇఁట్లో సోదాలు నిర్వహించింది. ఆ తర్వతా ఆయనపై కేసు కూడా నమోదు చేసింది. నియామకాల విషయంలో సత్రేంద్ర జైన్​ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ కేసు (ED Case on Satyendar Jain) నమోదైంది.

ఈ విషయాలన్నింటిని గుర్తు చేస్తూ.. కేజ్రివాల్​ బీజేపీపై విరుచుకుపడ్డారు. తమ ఎమ్మెల్యేలందరినీ అరెస్ట్ చేసినా తాము భయపడమని స్పష్టం (Delhi CM Arvind Kejriwal on ED raids) చేశారు.

సత్రేంద్ర జైన్​ వద్దకు మాత్రమే కాకుండా.. తనపైకి, మనీశ్ సిసోడియా, భగవంత్​ మాన్​ ఇంటికి కూడా ఈడీని పంపాలన్నారు. ఏ సంస్థలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

Also read: Omicron Variant Twice: ఒకే వ్యక్తికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎన్నిసార్లు సోకుతుందో తెలుసా..?

Also read: Arunachal Missing Boy: ఎట్టకేలకు అతని ఆచూకీ లభ్యం.. భారత్‌కు అప్పగిస్తామన్న చైనా ఆర్మీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News