BJP-JDS Alliance: దక్షిణాదిన మరో పొత్తు, ఎన్డీయేలో చేరనున్న జేడీఎస్
BJP-JDS Alliance: 2024 ఎన్నికల వేళ బీజేపీ కొత్త మిత్రుల్ని వెతుకుతోంది. దక్షిణాదిన బలపడేందుకు ప్రాంతీయ పార్టీలతో కొత్తు పొత్తుల దిశగా ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటక రూపంలో కొత్త పొత్తు పొడిచింది. ఆ వివరాలు మీ కోసం..
BJP-JDS Alliance: భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కొత్త పొత్తు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈసారి దక్షిణాదిపై ఫోకస్ పెట్టింది. కర్ణాటకలో పాత మిత్రుడిని మళ్లీ కలుసుకుంది. జేడీఎస్‌తో బీజేపీ పొత్తు దాదాపుగా ఖరారైంది. ఎన్డీయేకు కొత్త భాగస్వామి దొరికాడు.
బీజేపీ సారధ్యంలోని ఎన్డీయేకు దక్షిణాదిలో మరో మిత్రుడు దొరికాడు. పాత మిత్రుడే అయినా మద్యలో చాలాకాలంగా వైరి పక్షాలుగా ఉన్నాయి. ఇప్పుడు తిరిగి రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచింది. ఢిల్లీలో రెండు పార్టీల నేతల మధ్య సాగిన చర్చలు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. సీట్ల కేటాయింపు, పంపకంపై మాత్రమే ఇంకా స్పష్టత రావల్సి ఉంది.
ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఓటమి పాలయ్యాయి. 2018 ఎన్నికల్లో బీజేపీకు 36.35 శాతం ఓట్లు రాగా, 2023లో 0.35 శాతం తగ్గి 36 శాతానికి పరిమితమైంది. సీట్లలో మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే భారీ తేడా ఉంది. కారణంగా జేడీఎస్ ఓట్ల శాతం తగ్గి కాంగ్రెస్ పార్టీకు పెరగడమే. 2018లో 18.3 శాతం ఓట్లు సాధించిన జేడీఎస్ 2023 వచ్చేసరికి 13.29 శాతానికి పడిపోయింది. అంటే 5.01 శాతం ఓట్లు కోల్పోయింది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు చెక్ పెట్టాలంటే పొత్తు కచ్చితంగా ఉండాలని బీజేపీ భావించింది. అటు జేడీఎస్‌కు కూడా బలం అవసరం. అందుకే రెండు పార్టీల అవసరాలు ఆ పార్టీల మధ్య కొత్త పొత్తుకు దారి తీశాయి. ఇవాళ ఉదయం ఢిల్లీలో మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మీడియాతో మాట్లాడారు. సీట్ల పంపకం విషయం కుమారస్వామి-అమిత్ షా చూసుకుంటారన్నారు. ఉత్తరాదిలో దూసుకుపోతున్న ఎన్డీయేకు దక్షిణాది ఎప్పుడూ ప్రశ్నార్ధకమే. దక్షిణాదిలోని 5 రాష్ట్రాల్లో ఉన్న ఒకే ఒక రాష్ట్రం కర్ణాటక సైతం చేజారడంతో బలం పెంచుకునేందుకు ఆలోచిస్తోంది. అందుకే కొత్త పొత్తులు కుదర్చుకోనుంది.
బీజేపీతో పొత్తుల నేపధ్యంలో కుమారస్వామి, ఆయన సోదరుడు రేవణ్ణ, మూడోతరం నేతలు ప్రజ్వల్ రేవణ్ణ, నిఖిల్ ప్రస్తుతం ఢిల్లీలోనే మకాం వేశారు. 6 లోక్‌సభ స్థానాలపై కన్నేసిన జేడీఎస్ కనీసం నాలుగు స్థానాలు కేటాయించాలని పట్టుబడుతోంది. మాండ్య, హాసన్, కోలార్, తుంకూరు స్థానాల కోసం జేడీఎస్ ప్రయత్నిస్తోంది.
2028తో పోలిస్తే 2023లో బీజేపీ 0.35 శాతం ఓట్లు కోల్పోగా, జేడీఎస్ 5.01 శాతం ఓట్లు పోగొట్టుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం 2018 ఎన్నికలతో పోలిస్తే 2023లో 4.74 శాతం ఓట్లకు సాధించగలిగింది. జేడీఎస్ ప్రధానంగా దేవెగౌడకు చెందిన వొక్కలిగ సామాజికవర్గం ఓట్లపై ఆధారపడి ఉంది.
Also read: IRCTC South India Tour: 1000 రూపాయలకే సౌత్ ఇండియా మొత్తం చుట్టేయోచ్చు.. EMI ఆప్షన్ కూడా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook