IRCTC South India Tour: 1000 రూపాయలకే సౌత్ ఇండియా మొత్తం చుట్టేయోచ్చు.. EMI ఆప్షన్ కూడా!

భారతీయ రైల్వే ఆన్‌లైన్ టికెట్ రిజర్వేషన్ సంస్థ IRCTC సందర్శకులకు ఒక శుభవార్త తెలిపింది. దేఖో అప్నా దేశ్ ప్యాకేజీ కింద పూర్తి దక్షిణ భారతదేశం మొత్తం చుట్టి రావొచ్చు. దీంట్లో EMI ఆప్షన్ కూడా ఉంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2023, 04:24 PM IST
IRCTC South India Tour: 1000 రూపాయలకే సౌత్ ఇండియా మొత్తం చుట్టేయోచ్చు.. EMI ఆప్షన్ కూడా!

IRCTC South India Tour: భారతీయ రైల్వే ఆన్‌లైన్ టికెట్ రిజర్వేషన్ సంస్థ IRCTC ఓ కొత్త టూర్ ప్యాకేజీని టూరిస్టుల కోసం ప్రవేశపెట్టింది. దక్షిణ భారత ట్రావెల్ టూర్ ను దేఖో అప్నా దేశ్ ప్యాకేజీ కింద ప్రవేశపెట్టింది.  భారత్ గౌరవ్ రైలులో ఈ టూర్ ప్రయాణం ఉంటుంది. IRCTC దేశంలోని వాటితో పాటు విదేశాలలో ఉన్న ప్రయాణీకుల కోసం విభిన్న టూర్ ప్యాకేజీలను అందిస్తూ ఉండటం గమనార్హం. ఈ టూర్ ప్యాకేజీల ద్వారా ప్రయాణికులు సౌకర్యవంతంతో పాటు చౌకగా ప్రయాణిస్తారు. IRCTC టూర్ ప్యాకేజీ అతిపెద్ద లక్షణం ఏమిటంటే.. టూరిస్టులకు వసతి, ఆహారం ఉచితంగా అందించబడుతుంది. అయితే ఈ క్రమంలో సౌత్ ఇండియా ట్రావెల్ టూర్ ప్యాకేజీ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. 

EMI ద్వారా ప్యాకేజీ చెల్లించే అవకాశం..
IRCTC సౌత్ ఇండియా ట్రావెల్ టూర్ ప్యాకేజీని EMI ద్వారా చెల్లించే సౌకర్యాన్ని టూరిస్టులకు కల్పించబడింది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన ఛార్జీని ప్రతి నెలా రూ. 1039 వాయిదాల (EMI) ద్వారా చెల్లించవచ్చు. ప్రస్తుతం మీ వద్ద తగినంత డబ్బు లేకపోయినా.. ఈ టూర్ కు వెళ్లి నెలనెలా EMI చెల్లించే ప్రయోజనాన్ని పొందొచ్చు. 

11 రోజుల టూర్ ప్యాకేజీ..
IRCTC సౌత్ ఇండియా టూర్ ప్యాకేజీ మొత్తం 11 రోజులు ఉంటుంది. సౌత్ ఇండియా ట్రావెల్ టూర్ ప్యాకేజీ 10 రాత్రులు, 11 రోజులు ఉండనుండగా.. ఈ ప్రయాణం గోరఖ్‌పూర్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ టూర్ ప్యాకేజీకి ప్రారంభ ధర రూ. 21,420గా ఉంది. దీనిపై ఆసక్తి కలిగిన టూరిస్టులు ఈ టూర్ ప్యాకేజీని IRCTC అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com ద్వారా బుక్ చేసుకోవచ్చు.

Also Read: India Canada News: ఢిల్లీలో కెనడా దౌత్యవేత్తలకు కేంద్రం కీలక ప్రకటన..ఏం జరిగిందంటే?

టూర్ ప్యాకేజీ ఎప్పుడు ప్రారంభం..?
IRCTC సౌత్ ఇండియా టూర్ ప్యాకేజీ అక్టోబర్ 28 నుంచి ప్రారంభమవుతుంది. కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తిరుపతి గమ్యస్థానాలకు ఈ టూర్ ప్యాకేజీ వర్తిస్తుంది.

ఈ టూర్ ప్యాకేజీ ధర
IRCTC ప్రకటించిన ఈ టూర్ ప్యాకేజీకి ఛార్జీ భిన్నంగా ఉంది. టూర్ ప్యాకేజీలోని కంఫర్ట్ క్లాస్‌లో ప్రయాణిస్తే.. ఒక్కో వ్యక్తికి రూ. 48,420 చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీరు స్టాండర్డ్ కేటగిరీలో ప్రయాణించాలి అనుకుంటే మీరు ఒక్కొక్కరికి రూ. 36,400 చొప్పున చెల్లించాలి. అదే విధంగా మీరు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తే ఒక్కో వ్యక్తికి రూ. 21,420 డబ్బు కట్టాల్సి ఉంటుంది. 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలను కంఫర్ట్ క్లాస్ రూ. 46,700.. స్టాండర్డ్ కేటగిరీలో రూ. 35,000.. ఎకానమీ కేటగిరీలో రూ. 20,200 చెల్లించాలి.

Also Read: iPhone 15 Sale: ఐఫోన్ 15 అమ్మకాలు షురూ.. ఎగబడి కొంటున్న జనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News