New Criminal Laws: దేశానికి స్వాతంత్య్రం వచ్చి న 7 దశాబ్దాలు దాటుతున్నా ఇంకా అవే బ్రిటీషు కాలం నాటి చట్టాలే అమల్లో ఉన్నాయి. ఈ చట్టాలకు చెల్లుచీటీ చెబుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త క్రిమినల్ చట్టాలు తీసుకొచ్చింది. ఈ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్రిటీషు కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ , క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ , ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యం అధినియం చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ బిల్లుల్ని గత ఏడాది 2023లోనే పార్లమెంట్ ఆమోదించింది. జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బాధితులకు వేగవంతమైన న్యాయం అందించేందుకు వీలుగా కొత్త క్రిమినల్ చట్టాల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. దీని ప్రకారం సమన్లు కూడా ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేయవచ్చు. ఘోరమైన నేరాలు జరిగినప్పుడు ఆ ప్రాంతాన్ని తప్పనిసరిగా వీడియో తీయాలి. బాధితులతో పాటు నిందితులకు కూడా ఎఫ్ఐఆర్ కాపీలు అందించాలి. అరెస్ట్ వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్, జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ప్రదర్శించాలి. చిన్నారులు, మహిళలపై నేరాల్ని త్వరగా దర్యాప్తు చేయాలి.కేసు విచారణలో జాప్యం లేకుండా ఉండేందుకు గరిష్టంగా 2 వాయిదాలే ఉండాలి. మహిళలు, 15 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వారు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్థులు పోలీస్ స్టేషన్ వెళ్లకుండానే సహాయం పొందవచ్చు.


కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కడనేది సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లో ఎక్కడి నుంచైనా సరే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. అంటే ఫిర్యాదు ఇచ్చేందుకు ఇకపై పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. 


Also read: LK Advani: ఆస్పత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ.. అసలేం జరిగిందంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook