రాయబరేలిలో పట్టాలు తప్పిన రైలు: ఐదుగురు మృతి
రాయబరేలిలో పట్టాలు తప్పిన రైలు: ఐదుగురు మృతి
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాయబరేలీ సమీపంలో న్యూఢిల్లీ-మాల్డా మధ్య నడిచే న్యూ ఫరక్కా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు, అనేక మంది గాయపడినట్లు సమాచారం.
బుధవారం ఉదయం హరిచంద్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి న్యూ ఫరక్కా ఎక్స్‌ప్రెస్ రైలు బయల్దేరింది. కొద్దిసేపటికే.. స్టేషన్‌కు 50 మీటర్ల దూరంలో రైలు యొక్క ఆరు కోచ్లు (ఇంజన్ పెట్టెతో సహా) పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. మృతుల్లో మహిళ, ఒక చిన్నారి కూడా ఉన్నారు. అనేక మంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. లక్నో, వారణాసి నుండి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా ఘటనా స్థలానికి తరలి వెళ్లాయి.
ఈ ప్రమాదంపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యలను చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
అత్యవసర సమాచారం నిమిత్తం హెల్ప్‌లైన్ నంబర్లు అధికారులు ప్రకటించారు.
ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్లు:
దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్-బిఎస్ఎన్ఎల్-05412-254145, రైల్వే -027-73677
పాట్నా స్టేషన్ నం: బిఎస్ఎన్ఎల్-0612-2202290, 0612-2202291, 0612-220229, రైల్వే ఫోన్ నంబర్- 025-83288