New Interest Rates: కరోనా మహమ్మారి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. చిన్న పొదుపు పథకాలలో వడ్డీరేట్లను యధాతధంగా ఉంచింది. సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ఇతర పథకాల్లో వడ్డీ రేట్లు ఇలా ఉండనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సంక్షోభం నేపధ్యంలో దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింది. సామాన్యుల జీవితాలు అల్లకల్లోలమయ్యాయి. ఈ క్రమంలో చాలామంది చిన్న పొదుపు పథకాలపై ఆధారపడ్డారు. అందుకే కేంద్ర ప్రభుత్వం(Central government)చిన్న పొదుపు పథకాల ఖాతాదార్లైన సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్ అందించింది. 2021-22 రెండవ త్రైమాసికంలో వడ్డీ రేట్లను మార్చకుండా యధాతధంగా ఉంచింది. సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్,ఎస్ఎస్పీ,కేవీపీ వంటి చిన్న పొదుపు పథకాలపై వరుసగా ఐదు త్రైమాసికాలుగా వడ్డీ రేట్లను మార్చడం లేదు. దీనికి సంబంధించి ఆర్ధిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. జూలై 1 2021 నుంచి సెప్టెంబర్ 2021తో ముగిసే రెండవ త్రైమాసికంలో వడ్డీ రేట్లు( Interest Rate) గతంలో మాదిరిగానే ఉండనున్నాయని తెలిపింది. ప్రభుత్వం వెలువరించిన నోటిఫికేషన్ ప్రకారం వివిధ సేవింగ్స్ ఎక్కౌంట్లలో వడ్డీ రేట్లు ఇలా ఉండనున్నాయి.


పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్‌పై 7.1 శాతం వడ్డీ, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌పై 6.8 శాతం, సుకన్య సమృద్ధి యోజనపై 7.6 శాతం వడ్డీ, కిసాన్ వికాస్ పత్రపై 6.9 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో 7.4 శాతం వడ్డీ,  నెలవారీ ఆదాయపు అక్కౌంట్‌పై 6.6 శాతం వడ్డీ, సేవింగ్స్ ఖాతాలో 4 శాతం వడ్డీ ఉండనున్నాయి.


Also read: Cyber Securities Index: గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్..పదవ స్థానంలో ఇండియా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook