New traffic rules: ఆ సినిమాలో ఉన్నట్టే..ఉల్లంఘిస్తే జేబు గుల్లవుతుంది మరి
New traffic rules: భరత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రిగా మహేశ్ బాబు తీసుకొచ్చిన ట్రాఫిక్ రూల్స్ చూసి ఆశ్చర్యపోయారు కదా. ఇప్పుడు భీమా రెగ్యులేటరీ అథారిటీ కొత్త రూల్స్ కాస్త అలానే ఉండబోతున్నాయి..
New traffic rules: భరత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రిగా మహేశ్ బాబు తీసుకొచ్చిన ట్రాఫిక్ రూల్స్ చూసి ఆశ్చర్యపోయారు కదా. ఇప్పుడు భీమా రెగ్యులేటరీ అథారిటీ కొత్త రూల్స్ కాస్త అలానే ఉండబోతున్నాయి..
ట్రాఫిక్ రూల్స్ ( Traffic rules ) ఏ మాత్రం పట్టించుకోని దేశాల్లో మనదేశం ఒకటి కచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఏదైనా నడుస్తుందనుకుంటారు. ఎన్ని కొత్త ట్రాఫిక్ చట్టాల్ని తీసుకొచ్చినా..అంతే. ప్రయోజనం కన్పించదు. ఇష్టారాజ్యంగా ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘిస్తుంటారు. ఫలితంగా ఇతర వాహనదారులు ఇబ్బందులకు గురవుతుంటారు. భరత్ అనే నేను ( Bharat ane nenu ) సినిమా చూసినప్పుడు మనదేశంలో కూడా అలాంటి రూల్స్ ఉండాలని కొందరు భావించి ఉండవచ్చు అందుకే.
అందుకే ఇంచుమించు అలాంటివే కొత్త రూల్స్ ( New Traffic rules ) రాబోతున్నాయి. భీమా రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ ( IRDAI ) కొత్త నిబంధనల్ని తీసుకొస్తోంది. ట్రాఫిక్‌కు భీమాకు సంబంధమేంటనుకుంటున్నారు కదా..ఉంది సంబంధం. ట్రాఫిక్ నిబంధనల్ని తరచూ ఉల్లంఘించేవారి భీమా ప్రీమియం పెరిగిపోతుంటుంది. కొత్త నిబంధనల వల్ల ట్రాఫిక్ చలానా ( Trafic Challan ) తో పాటు ఎక్కువ ప్రీమియం కట్టాల్సిందే. ఇప్పటికే దీనికి సంబందించిన తుది నివేదికను ఐఆర్‌డిఎఐ ( IRDAI ) సిద్ధం చేసింది. ముందు ఈ కొత్త నిబంధనలు దేశ రాజధాని ఢిల్లీలో అమలులోకి రావచ్చు. తర్వాత దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకురానున్నారు. వాహన భీమా ( Vehicle Insurance ) తీసుకునేటప్పుడు..గత రెండేళ్ల నాటి ట్రాఫిక్ చలానాల్ని పరిగణలో తీసుకుని ప్రీమియం నిర్ణయిస్తారు.
Also read: Republic Day 2021: 72వ రిపబ్లిక్ డే.. 5 ముఖ్యమైన విషయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook