Republic Day 2021: 72వ రిపబ్లిక్ డే.. 5 ముఖ్యమైన విషయాలు

కరోనా వైరస్ నేపథ్యంలో భారత్‌లో తొలిసారి గణతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. జనవరి 26న 72వ భారత గణతంత్ర దినోత్సవం. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఈ వేడుకల్ని నిర్వహించనున్నారు. గతానికి భిన్నంగా ఈ ఏడాది కోవిడ్-19 నిబంధనల నడుమ రిపబ్లిక్ డే నిర్వహిస్తారు.

1 /6

కరోనా వైరస్ నేపథ్యంలో భారత్‌లో తొలిసారి గణతంత్ర దినోత్సవం(Republic Day) జరుపుకోబోతున్నాం. జనవరి 26న 72వ భారత గణతంత్ర దినోత్సవం. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఈ వేడుకల్ని నిర్వహించనున్నారు. గతానికి భిన్నంగా ఈ ఏడాది కోవిడ్-19 నిబంధనల నడుమ రిపబ్లిక్ డే నిర్వహిస్తారు.

2 /6

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది విదేశీ ప్రత్యేక అతిథి హాజరు కావడం లేదు. విదేశీ అతిథి లేకుండానే భారత్ రిపబ్లిక్ వేడుకలు నిర్వహించడం ఇది నాలుగోసారి మాత్రమే. 1952, 1953 మరియు 1966లలో విదేశీ అతిథి హాజరు కాలేదు. (ANI Photo)

3 /6

నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) కమాండోలు రిపబ్లిక్ డే నిర్వహణను కోవిడ్-19 నిబంధనల నడుమ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 1.5 మీటర్ల సోషల్ డిస్టాన్సింగ్‌తో మార్చ్ చేయనున్నారు. (ANI Photo) Also Read: 7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. త్వరలో కీలక ప్రకటన

4 /6

321 పాఠశాలల విద్యార్థులు మరియు 80 జానపద కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు.  ఈస్ట్ జోన్‌కు చెందిన కళాకారులు సైతం గణతంత్ర వేడుకలో పాలు పంచుకోనున్నారని ప్రకటించారు. Also Read: ATM Safety Tips: ఏటీఎం సేఫ్టీ టిప్స్ సూచించిన ఎస్‌బీఐ

5 /6

ఈ ఏడాది అట్టారి సరిహద్దులో రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించడం లేదు. జనవరి 26న భారత్, పాకిస్తాన్‌లు సంయుక్తంగా పరేడ్ నిర్వహించేవి. కరోనా నేపథ్యంలో మార్చి 2020 నుంచి సామాన్యులను అట్టారి బార్డర్‌లోకి అనుమతించడం లేదని తెలిసిందే. (ANI Photo) Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకునే మద్యం ప్రియులకు చేదువార్త..

6 /6

నూతన వ్యవసాయ చట్టాలపై నిరసన తెలుసుతున్న రైతులు  రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. 5000 మంది రైతులు ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొంటారని అంచనా. (ANI Photo)