Your take home salary: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వేజ్ కోడ్ ప్రస్తుతానికి లేనట్టేనా ?
New take home salary structure: వేతన జీవులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 1 నుంచి 2021-22 కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుండగా, అదే రోజు నుంచి కొత్త వేజ్‌కోడ్ కూడా అమలులోకి రానున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ముందుగా అనుకున్నట్టుగా ఏప్రిల్ 1 నుంచే New wage code అమలు చేయడం లేదని కార్మిక మంత్రిత్వ శాఖకి చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించినట్టుగా ఎకానమిక్ టైమ్స్ కథనం పేర్కొంది.
New take home salary structure: వేతన జీవులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 1 నుంచి 2021-22 కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుండగా, అదే రోజు నుంచి కొత్త వేజ్‌కోడ్ కూడా అమలులోకి రానున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ముందుగా అనుకున్నట్టుగా ఏప్రిల్ 1 నుంచే New wage code అమలు చేయడం లేదని కార్మిక మంత్రిత్వ శాఖకి చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించినట్టుగా ఎకానమిక్ టైమ్స్ కథనం పేర్కొంది. ప్రస్తుతానికి కేంద్రం ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు సమాచారం. తెల్లవారితే ఏప్రిల్ 1వ తేదీ వచ్చేస్తోంది, వేజ్ కోడ్ మారబోతోంది (Changes from April 1st) అని ఆందోళన చెందుతున్న ఉద్యోగులకు, ఉద్యోగుల జీతాలు ఎలా రీస్ట్రక్చర్ (Employees salary restructure) చేయాలని మల్లగుల్లాలు పడుతున్న కంపెనీలకు ఇది ఒకరకంగా ఒకింత ఉపశమనం కలిగించే అంశం కానుంది.
ఉపశమనం ఎందుకంటే..
ఒకవేళ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న కొత్త వేతనాల పాలసీ అమలులోకి వచ్చినట్టయితే, ఉద్యోగుల వేతనాలు ప్రభావితం అవుతాయి. కొత్త వేజ్ కోడ్ ప్రకారం ఉద్యోగులకు నెలానెలా అందే జీతం (Net pay) తగ్గిపోనుంది. అందుకు కారణం జీతాల్లో కోత విధించడం కాదు.. ఉద్యోగుల శాలరీ స్ట్రక్చర్‌లో, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యూటీల్లో మార్పులుచేర్పులు చేసుకోనుండటమే.
Also read : PAN-Aadhaar Linking: పాన్ కార్డ్, ఆధార్ అనుసంధానం చేసుకున్నారా, నేటితో ముగియనున్న డెడ్‌లైన్
ఎవరెవరికి ఈ కొత్త వేజ్ కోడ్ వర్తించనుంది ?
గతేడాది పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టిన ఈ కొత్త వేజ్ కోడ్ బిల్లుకు ఇప్పటికే ఆమోదముద్ర లభించింది. ఒకసారి ఈ కొత్త వేజ్ కోడ్ అమలులోకి వచ్చినట్టయితే, అది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేసే ఉద్యోగులకు (Govt and private employees) సైతం వర్తించనుంది.
Also read : ITR Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టాలు, కొత్త నియమాలు ఇవే, ఎవరిపై ప్రభావం
జీతాలు ఎందుకు తగ్గనున్నాయంటే..
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌తో (Provident fund) పాటు వారి ఖాతాల్లో కంపెనీలు జమ చేయాల్సిన ప్రావిడెంట్ ఫండ్ మొత్తం పెరగనుంది. పీఎఫ్ డిడక్షన్స్ (PF deductions) పెరగనుండటంతో ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ తగ్గిపోనుంది.
ఉద్యోగులతో పాటు కంపెనీలకూ ఉపశమనం..
కొత్త వేజ్ కోడ్ (New wage code) అమలులోకి రానుండటంతో ప్రస్తుతం కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలను ఎలా రీస్ట్రక్చర్ చేయాలా అనే కోణంలో ప్రణాళికలు రచించుకుంటున్నాయి. ఇదివరకు ప్రచారం జరిగినట్టుగా ఏప్రిల్ 1 నుంచే ఈ వేజ్ కోడ్ అమలులోకి వచ్చినట్టయితే, వారికి ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు ఎక్కువ సమయం కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడప్పుడే వేజ్ కోడ్ అమలులోకి రానట్టయితే.. ఉద్యోగుల Salary restructure చేసుకునేందుకు కంపెనీలకు కూడా తగినంత వెసులుబాటు లభించినట్టే అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook