Pakistan Arms To Adilabad: దేశంలో ఎక్కడ ఉగ్రవాదుల మూలాలు కనిపించినా.. దానికి తెలంగాణతో లింకులు బయటికి వస్తుంటాయి. గతంలో చాలా మంది హైదరాబాదీలను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. తాజాగా గత నెలలో హర్యానాలో పట్టుబడిన నలుగురు ఉగ్రవాదుల విచారణలో తెలంగాణ లింకులు బయటికి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి NIA దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి.హర్యానాలో పట్టుబడిన ఉగ్రవాదులకు ఆదిలాబాద్ లింక్ ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నలుగురు ఉగ్రవాదులు ఎన్ఐఏ కీలక సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. ఆదిలాబాద్ కు పాకిస్తాన్ నుంచే ఆయుధాలు వచ్చినట్లు తేలింది. ఖలిస్తానీ ఉగ్రవాదులు జహీరాబాద్ కి  పేలుడు పదార్థాలను తీసుకొచ్చారని గుర్తించారు. గత మార్చి 30, ఏప్రిల్ 1వ తేదీనే  జహీరాబాద్ కి  ఐఈడీ, మారణాయుధాలను చేరవేసినట్లు తేలింది. హైదరాబాద్-జహీరాబాద్ జాతీయ రహదారిపై దగ్గర్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆయుధాలు డెలివరీ అయినట్లుగా ఎన్ఐఎ నిర్ధారించింది.


మే5న హర్యానా పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. కర్నాల్ లో  నలుగురు ఖలిస్తానీ తీవ్రవాదులను అరెస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో బస్తారా టోల్ ప్లాజా సమీపంలో ఫిరోజ్‌పూర్‌కు చెందిన ముగ్గురు, లూథియానాకు చెందిన ఒక తీవ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను గుర్‌ప్రీత్, అమన్‌దీప్, పర్మీందర్, భూపిందర్‌గా గుర్తించారు. పట్టుబడిన నిందితులు పాకిస్థాన్‌ నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్‌కు డ్రోన్స్‌ ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలను చేరవేస్తున్నట్టు కర్నాల్‌ ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు, టిఫిన్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు.


పట్టుబడిన ఉగ్రవాదులు ఆదిలాబాద్ కు ఆయుధాలు తరలిస్తున్నట్లు తేలింది. దీంతో కేసును ఎన్ఐఏకి అప్పగించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణలో సంచలన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. తమ కంటే ముందే మరికొందరు కొందరు జహీరాబాద్ లో  ఐడి సహా మారణాయుధాలు సరఫరా చేసినట్లు ఖలీస్తాన్ ఉగ్రవాదులు అంగీకరించారు. అయితే ఆయుధాలు,పేలుడు పదార్థాలను ఎవరికి ఇచ్చారు.. ఎక్కడికి చేర్చారు అన్న విషయాలపై ఉగ్రవాదులు క్లారిటీ ఇవ్వడం లేదని తెలుస్తోంది. హర్యానాలో పట్టుబడిన నలుగురు ఉగ్రవాదులను తెలంగాణకు తీసుకువచ్చారు ఎన్ఐఏ అధికారులు ఆయుధాలు ఎక్కడ డెలివరీ చేశారో తెలుసుకునే ప్రయత్నం చేశారు.


హర్యానా నుంచి ఆదిలాబాద్‌కు వీటిని తరలించి.. అక్కడి నుంచి నాందేడ్‌కు ఆ ఆయుధాలు, పేలుడు పదార్థాలను పంపించేందుకు ఈ ముఠా కుట్ర పన్నిందని దర్యాప్తులో తేలింది. గతంలోనూ ఈ ముఠా.. పాకిస్తాన్‌ నుంచి నాందేడ్‌కు ఆయుధాలను పంపించిందని పోలీసుల విచారణలో తేలింది. వీళ్లకు పాక్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు కూడా తేల్చారు. దాయాది దేశం పాకిస్థాన్ నుంచి డ్రోన్‌ల ద్వారా భారత సరిహద్దులోకి ఉగ్రవాదులు ఆయుధాలను చేరవేస్తున్నారు. ఆ ఆయుధాలను పాక్‌ సరిహద్దు నుంచి ఈ ఖలిస్తాన్‌ ఉగ్రవాద ముఠా హర్యానాకు చేరవేసింది. దీంతో పోలీసులు మరింత సీరియస్‌గా ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Read also:Telangana SSC Results: ఏపీలో తగ్గిన టెన్త్ ఉత్తీర్ణత.. తెలంగాణ ఫలితాలపై ఉత్కంఠ! రిలీజ్ ఎప్పుడంటే...


Read also: Gang Rape Case: గ్యాంగ్ రేప్ కేసులో సంచలనం.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ పై కేసు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook