Nine Passengers tested COVID positive in Mumbai Airport: కరోనా కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ భయాలు (Omicron scare in India) వెంటాడుతున్న వేళ..ముంబయి ఎయిర్​పోర్ట్​లో ఇవాళ ఒకే సారి 9 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్​గా తేలింది. అయితే వారికి ఒమిక్రాన్​ సోకిందా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపారు (Corona cases in Mumbai Airport) అధికారులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబయి ఎయిర్​పోర్ట్​లో కఠిన నేపథ్యంలో..


భారత్​లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయటపడక ముందు నుంచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎయిర్​పోర్ట్​లలో  కఠిన నిబంధనలను అమలు (COVID rules at Mumbai airport) చేస్తున్నాయి.


మంబయిలో అంతర్జాతీయ ప్రయాణికులతో పాటు దేశీయ ప్రయాణికులకు కూడా ఆర్​టీ-పీసీఆర్​ టెస్టులు తప్పనిసరి (RT-PCR test Mandatory) చేసింది. టెస్ట్ రిజల్ట్ నెగెటివ్ వస్తేనే బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. దీనితో పాటు.. ఎయిర్​పోర్ట్​కు వచ్చే వారుకు కూడా 72 గంటల్లోపు ఆర్​టీ-పీసీఆర్ నెగెటివి రిపోర్ట్​తో రావాలని స్పష్టం చేశారు ఎయిర్​పోర్ట్ అధికారులు. ఇక అంతర్జాతీయ ప్రయాణికులకు క్వారంటైన్ తప్పనిసరి చేశారు అధికారులు.


ముంబయి నుంచి ఇతర రాష్ట్రాలోని పట్టణాలకు దేశీయ విమానాలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ కఠిన నిబంధనలు పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్వహించిన టెస్టులో 9 మందికి పాజిటివ్​గా తేలింది.


భారత్​లోకి ఇప్పటికే ఒమిక్రాన్ ఎంట్రీ..


భారత్​లోకి ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు (Omicron cases in India) బయట పడ్డాయి. కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కచ్చితంగా మాస్క్ ధరించాలని స్పష్టం చేసింది.


ఢిల్లీలో 12 మందిపై ఒమిక్రాన్​ అనుమానాలు..


కరోనా కారణంగా.. ఢిల్లీలోని లోక్​ నాయక్​ జయ్ ప్రకాశ్​ నారాయణ్​ ఆస్పత్రిలో చేరిన 12 మందిలో ఒమిక్రాన్​ వేరియంట్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వారి శాంపిళ్లను తదుపరి పరీక్షలకు పంపారు అధికారులు.


Also read: Travel History లేని బెంగళూరు వైద్యుడికి ఒమిక్రాన్‌.. భయాందోళనలో భారత్! ఇంతకీ ఎలా సోకింది?


Also read: Corona cases in India: దేశంలో మళ్లీ లక్షకు చేరువలో యాక్టివ్ కరోనా కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook