Nipah Virus Deaths in Kerala: నిపా వైరస్ మరోసారి భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ వైరస్ కారణంగా కేరళ కోజికోడ్ జిల్లాలో రెండు మరణాలు సంభవించాయి. మరో నాలుగు కేసులు అనుమానిత కేసులు ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు అనుమానితుల నమూనాలను సేకరించి నిర్ధారణ కోసం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పంపించారు. ఈ శాంపిల్స్‌లో నిపా పాజిటివ్‌గా తేలితే.. నాలుగేళ్లలో తరువాత దేశంలో ఇవే మొదటి కేసులు అవుతాయి. 2019లో కేరళకు చెందిన 23 ఏళ్ల విద్యార్థి చివరి కేసు నమోదైంది. విద్యార్థి అనారోగ్యం నుంచి కోలుకోవడంతో కేవలం ఒక్క కేసునే అప్పుడు వ్యాప్తి ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు నమోదవ్వడంతో ఆందోళన మొదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిపా అంటే ఏమిటి?


నిపా అనేది వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ప్రధానంగా గబ్బిలాలు, పందులు, కుక్కలు, గుర్రాలు వంటి జంతువులను ప్రభావితం చేస్తుంది. జూనోటిక్‌గా ఉండటంతో ఇది సోకిన జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. ఒక్కసారి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి కూడా సోకుతుంది. ఆ తరువాత తీవ్రమైన వ్యాధిగా మారుతుంది. మలేషియాలోని సుంగైలో ఈ వైరస్‌ను మొదటిసారి 1999లో గుర్తించారు. 


లక్షణాలు ఏంటి..?


==> ఇది సాధారణంగా జ్వరం, మెదడు వాపు వంటి ఎన్సెఫాలిటిస్‌గా కనిపిస్తుంది
==> తలనొప్పి
==> శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
==> దగ్గు, గొంతు నొప్పి
==> అతిసారం
==> వాంతులు
==> కండరాల నొప్పి మరియు తీవ్రమైన బలహీనత
==> మనిషికి దిక్కుతోచని స్థితి, మూర్ఛలు రావడం.


కేసులను ముందుగానే గుర్తించి మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించాలి. కేస్ ఫెటాలిటీ రేషియో-ఇన్‌ఫెక్షన్‌కు పాజిటివ్ పరీక్షించిన వారిలో మరణాల నిష్పత్తి నిపాకు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కాస్త ఊరట కలిగించే విషయం ఏంటంటే.. ఈ వ్యాధి కోవిడ్-19 లేదా ఇన్‌ఫ్లుఎంజా మాదిరి వేగంగా వ్యాపించదు. తక్కువ సమయంలో ఎక్కువ ఇన్‌ఫెక్షన్‌లను కలిగించే అవకాశం లేదు. ప్రస్తుతానికి దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు ప్రస్తుతం ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం లేదు. 


కేరళలో కేసులు వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. పరిస్థితిని సమీక్షించడానికి, నిపా వైరస్‌ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయడానికి కేంద్ర బృందాన్ని కేరళకు చేరుకుంది. "నేను కేరళ ఆరోగ్య మంత్రితో మాట్లాడాను. ఈ వైరస్ గురించి చాలాసార్లు నివేదికలు వచ్చాయి. కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది. దీనికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక మార్గదర్శకాన్ని సిద్ధం చేసింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి" అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా తెలిపారు.


Also Read: MP Komatireddy: ఎవడిదిరా బానిసత్వ పార్టీ.. మంత్రి కేటీఆర్‌పై ఎంపీ కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు  


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook