న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిర్భయ కేసు దోషుల ఉరిశిక్షకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలో నలుగురు దోషులలో ఒకరైన ముకేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వద్దకు చేరింది. గురువారం (జనవరి 16) రాత్రి ముకేశ్ పిటిషన్‌ను రాష్ట్రపతి భవన్‌కు పంపించినట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది. ఆ పిటిషన్‌ను తిరస్కరించాలని సైతం హోంమంత్రిత్వశాఖ కోవింద్‌కు సిఫార్సు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ఈ 22న నిర్భయ దోషులకు ఉరి. ఎవరీ పవన్ జల్లాద్?


జనవరి 22న ఉదయం 7 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ కొన్ని రోజుల కిందట ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరు దోషులు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేసుకోగా ఎన్వీ రమణ ధర్మాసనం వాటిని తిరస్కరించింది. అనంతరం దోషుల్లో ఒకడైన ముకేశ్ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. 



తొలుత ఢిల్లీ ప్రభుత్వం ఆ పిటిషన్‌ను తిరస్కరించాలని లెఫ్టినెంట్ గవర్నర్‌కు సిఫార్సు చేసింది. దాన్ని ఆమోదించిన లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోంశాఖకు పిటిషన్‌ను పంపుతూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గురువారం రాత్రి రాష్ట్రపతి కోవింద్‌కు క్షమాభిక్ష పిటిషన్‌ను కేంద్ర హోంశాఖ పంపంచింది. ఆ పిటిషన్‌ను తిరస్కరించాలని కేంద్ర హోంశాఖ కార్యాలయం సూచించినట్లు సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..