న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నలుగురు దోషులకు పాటియాలా హౌస్ కోర్టు ఉరిశిక్ష అమలు తేదీని జనవరి 22న ఉదయం 7 గంటలుగా ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే వీరి మరణశిక్ష తేదీ ఖరారైన సమయం నుంచి అధికారులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను ఇటీవల ధర్మాసనం కొట్టివేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ఉరిశిక్ష వేసే ముందు నిజంగానే చివరి కోరిక అడుగుతారా?


వీరికి ఉన్న ఆఖరి అవకాశం క్యూరేటివ్ పిటిషన్. ఈ మేరకు నిర్భయ దోషులలో ఇద్దరు వినయ్ కుమార్, ముఖేష్‌లు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్యూరేటివ్ పిటిషన్లపై జనవరి 14న ఎన్వీ రమణ నేతృత్వంలోని అరుణ్ మిశ్రా, ఆర్.ఎఫ్ నారిమన్, ఆర్ భానుమతి, అశోక్ భూషణ్  లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరపనుంది. తమ తుది నిర్ణయాన్ని సైతం అదేరోజు ధర్మాసనం వెల్లడించనుంది.


Also Read: నిర్భయ ఘటన: ఆ రోజు ఏం జరిగింది?


తిహార్ జైల్లో నలుగురు దోషుల ఉరిశిక్ష అమలకు ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి. అయితే అయిదుగురు న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే క్యూరేటివ్ పిటిషన్ తిరస్కరణకు గురైతే తమ మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరే అవకాశాలున్నాయి. 


పాటియాలా హౌస్ కోర్టు నిర్భయ కేసు దోషులు ముకేశ్, పవన్ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్, వినయ్ శర్మలకు క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లకు అనుమతినిస్తూ రెండు వారాల గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. జనవరి 22న ఉదయం 7 గంటలకు ఉరిశిక్షను అమలు చేయాలని డెత్ వారెంట్ ఇదివరకే జారీ చేసింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..