Why Rs 2,000 Notes are not available in ATMs: న్యూ ఢిల్లీ: ఏటీఎంలలో బ్యాంకులు రూ. 500, రూ. 2,000 నోట్లు లోడ్ చేయాలి లేదా లోడ్ చేయొద్దు అనే విషయంలో కేంద్రం నుంచి బ్యాంకులకు ఎలాంటి ఆదేశాలు జారీచేయలేదు అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా వార్షిక నివేదికల ఆధారంగా ఉన్న గణాంకాలను పరిశీలిస్తే... 2017 మార్చి చివరి నాటికి చెలామణిలో ఉన్న రూ. 500, రూ. 2,000 నోట్ల మొత్తం విలువ రూ. 9.512 లక్షల కోట్లు కాగా 2022 మార్చి చివరి నాటికి రూ. 27.057 లక్షలు కోట్లుగా ఉన్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్ సభకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏటీఎంలలో రూ.2,000 నోట్లను నింపకూడదు అని కేంద్రం వైపు నుంచి బ్యాంకులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు అని కేంద్రమంత్రి స్పష్టంచేశారు. వినియోగదారుల వినియోగం, వారి అవసరాలు, సీజనల్ ట్రెండ్ వంటి అంశాల ఆధారంగా ఏటీఎంలలో లోడింగ్ చేసే కరెన్సీ డినామినేషన్ ను బ్యాంకులే సొంతంగా అంచనా వేసుకుంటాయని.. అందులో కేంద్రం జోక్యం ఉండదని కేంద్ర మంత్రి తేల్చిచెప్పారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు లేవనెత్తిన మరో ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇస్తూ, మార్చి 31, 2023 నాటికి కేంద్ర ప్రభుత్వం రుణాలు / అప్పుల మొత్తం విలువ సుమారు రూ. 155.8 లక్షల కోట్లు ఉంటుందని.. ఇది జీడీపీలో 57.3 శాతం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న మారకపు విలువ ప్రకారం బయటి నుంచి పొందిన విదేశీ రుణాల మొత్తం రూ.7.03 లక్షల కోట్లుగా ఉంటుందన్నారు. 


"ప్రభుత్వం మొత్తం రుణం/బాధ్యతలలో బయటి నుంచి పొందిన రుణాల వాటా కేవలం 4.5 శాతం మాత్రమే కాగా ఇది జీడీపీలో 3 శాతం కంటే తక్కువే అవుతుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విదేశీ రుణాలు పొందే విషయానికొస్తే.. వీలైనంత తక్కువ వడ్డీ రేట్లకు ద్వైపాక్షిక ఏజెన్సీల ద్వారా నిధులు సమకూర్చుకోవడం జరుగుతుందని అన్నారు. భారత్ నుండి ఎగుమతుల అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో పాటు గ్లోబల్ ట్రేడింగ్ కమ్యూనిటీలో రూపాయికి మద్దతు ఇవ్వడానికి ఆర్‌బిఐ ఇన్‌వాయిస్, చెల్లింపు, ఎగుమతులు / దిగుమతుల పరిష్కారం కోసం అదనపు ఏర్పాట్లు చేసిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు.


ఇది కూడా చదవండి : Delhi Liquor Scam Case: ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట ఇద్దరినీ విచారించనున్న ఈడీ


ఇది కూడా చదవండి : SSC GD Constable Recruitment 2023: గుడ్ న్యూస్.. ఎస్ఎస్‌సి కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య 50187 కి పెంపు


ఇది కూడా చదవండి : Ramadan 2023: రంజాన్ ఉపవాసాల్లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎవరికి మినహాయింపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook