న్యాయ్ పథకంపై కామెంట్స్: ఇసికి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడి వివరణ
న్యాయ్ పథకంపై కామెంట్స్: ఇసికి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడి వివరణ
న్యూఢిల్లీ: రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకొస్తే, ప్రతీ పేద కుటుంబానికి న్యాయ్ పథకం కింద నెలకు రూ.6000 జమ అయ్యేలా చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీపై నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజివ్ కుమార్ పలు అభ్యంతరాలు వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. అయితే, తమ హామీలపై రాజివ్ కుమార్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తగదని కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి కూడా తెలిసిందే.
ఇదిలావుంటే, మంగళవారం ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చిన రాజివ్ కుమార్.. ''తాను కేవలం ఓ ఆర్థికవేత్తగానే న్యాయ్ పథకంపై వ్యాఖ్యలు చేశాను'' అని తన వివరణలో పేర్కొన్నారు.