న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ (Coronavirus) శరవేగంగా వ్యాపిస్తోందనే ఆందోళనల నేపథ్యంలో ప్రజా సౌకర్యార్థం కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల వద్ద తాత్కాలికంగా టోల్ ఫీజు వసూలు చేయవద్దంటూ (Toll fee suspended) కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి ( Minister Nitin Gadkari) ఓ ప్రకటన విడుదల చేశారు. టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు వసూలు చేయకపోవడం ద్వారా ప్రజలకు అత్యవసర సేవల అందించడంలో ఏర్పడుతున్న అసౌకర్యం తొలగిపోనుండటంతో పాటు క్లిష్టమైన పరిస్థితుల్లో సమయం కూడా వృథాకాకుండా ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని కేంద్రం తేల్చిచెప్పింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : Coronavirus alert: తెలంగాణలో 3 ఏళ్ల బాబుకు కరోనావైరస్!


ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పటికే 4,17,966 మందికి సోకగా.. వారిలో 18,615 మంది చనిపోయారు. ఒక్క ఇటలీలోనే 40,028 మందికి కరోనా వైరస్ వ్యాపించగా.  6,820 మంది మృతి చెందారు. ఇక భారత్‌లో కరోనా వైరస్ అప్‌డేట్స్‌ని పరిశీలిస్తే... బుధవారం రాత్రి నాటికే తెలంగాణలో ఇద్దరికి, ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరికి, రాజస్తాన్‌లో ఇద్దరికి, తమిళనాడులో ముగ్గురికి, ఢిల్లీలో ఐదుగురికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. తెలంగాణలో బుధవారం కరోనా సోకిన వారిలో ఒక మహిళతో పాటు మరో మూడేళ్ల చిన్నారి ఉన్నారు. వీరిలో చాలా మందికి విదేశాలకు వెళ్లొచ్చినట్టుగా లేదా వారికి సంబంధించిన వారు విదేశాలకు వెళ్లొచ్చినట్టు సమాచారం అందుతోంది.


 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..