Nitish Kumar Touch Feet: అవసరమైతే మీ కాళ్లు మొక్కుతా? ముఖ్యమంత్రి వింత ప్రవర్తన
Nitish Kumar Request To Touch Your Feet: అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ముఖ్యమంత్రి అధికారుల కాళ్లు మొక్కేందుకు సిద్ధమయ్యారు.
Nitish Kumar Touch Feet: దేశంలో రెండు వారాల వ్యవధిలోనే దాదాపు పదికి పైగా ఫ్లై ఓవర్లు కుప్పకూలిపోతున్నాయి. దేశవ్యాప్తంగా బిహార్‌లో ఫ్లై ఓవర్ నిర్మాణంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో నిర్వహించిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అనూహ్యంగా ఓ అధికారికి నమస్కారం చేశారు. కాళ్లు మొక్కుతా అని అధికారిని బతిమిలాడారు. తన రాష్ట్రంలో ఫ్లై ఓవర్లు కూలిపోతున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఇలా వ్యవహరించారని తెలుస్తోంది.
Also Read: Vishva Hindu Parishad: రాహుల్ వ్యాఖ్యలపై వీహెచ్‌పీ ఆగ్రహం.. లీడర్‌గా నిరూపించుకునేందుకు తహతహ
బిహార్‌లో జేపీ గంగా పథ్ ప్రాజెక్టులో భాగంగా పట్నాలోని గయా ఘాట్ నుంచి కంగన్ ఘాట్ వరకు రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు. దీనికి సంబంధించి మూడో దశ పనులను బుధవారం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రారంభించారు. ఈ క్రమంలో మిగతా పనులను కూడా శరవేగంగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే పనులు చేయాలని.. దాని కోసం మీ కాళ్లకు నమస్కరిస్తా అంటూ అధికారికి చెప్పారు. ఈ పరిణామంతో అధికారులు విస్తుపోయారు.
Also Read: Special Status: మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా.. నితీశ్ డిమాండ్‌తో చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి
జేపీ గంగా పథ్ ప్రాజెక్టులో మూడో దశ పనులను వివరాలు, పురోగతిని అధికారులు వివరిస్తున్నారు. అయితే ఈ పనుల తీరుపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలని నిర్మాణ సంస్థను ఆదేశించారు. దయచేసి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని కోరారు. 'పనులు వెంటనే పూర్తి చేయండి. కావాలంటే మీ కాళ్లకు నమస్కరిస్తా. సకాలంలో పనులు పూర్తి చేయండి అయ్యా' అంటూ సీఎం నితీశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఆ అధికారి చేతులు పట్టుకుని అడిగేందుకు ప్రయత్నించగా.. ఆ అధికారి నిరాకరించారు. 'అలా చేయకండి' అంటూ ఆ అధికారి వెనక్కి తగ్గారు. అయితే నితీశ్ కుమార్ ఇలా ప్రవర్తించడం మొదటిసారి కాదు. కొన్నాళ్ల కిందట భూ వివాదం విషయంలో ఓ అధికారిని నితీశ్ ఇలాగే బతిమిలాడారు.
ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు?
అయితే కేంద్రంలో కీలక భూమిక పోషిస్తున్న నితీశ్ ఇలా బతిమిలాడడం.. ఆయన వ్యవహార శైలి వింతగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇటీవల బిహార్‌లో పెద్ద ఎత్తున ఫ్లైఓవర్లు కుప్పకూలిపోతున్నాయి. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుండడంతో నితీశ్ ఇలా ప్రవర్తిస్తున్నారని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter