Special Status: మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా.. నితీశ్‌ డిమాండ్‌తో చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి

Nitish Kumar Demands Special Status: ముగిసిన అధ్యాయంగా భావిస్తున్న ప్రత్యేక హోదా మళ్లీ తెరపైకి వచ్చింది. నితీశ్‌ కుమార్‌ పార్టీలో తీర్మానం చేయడంతో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 29, 2024, 07:30 PM IST
Special Status: మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా.. నితీశ్‌ డిమాండ్‌తో చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి

Special Status: ఉమ్మడి ఏపీ విభజన సమయంలో.. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక అంశంగా మారిన అంశం ప్రత్యేక హోదా మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే హోదా ప్రస్తావన ఎత్తింది మాత్రం బిహార్‌. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న నితీశ్ కుమార్‌ ఈ డిమాండ్‌ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించి ఎన్డీయే సర్కార్‌ను నితీశ్‌ ఇరకాటంలో పెట్టడం విశేషం. అయితే మరి ఎన్డీయేలో అదే స్థాయిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అడగాలనే డిమాండ్లు వస్తున్నాయి.

Also Read: Hemant Soren: మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్.. మొన్న కేజ్రీవాల్‌.. నేడు సోరెన్‌.. రేపు కవిత?

 

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం జనతా దళ్‌ (యునైటెడ్‌) జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీ కోరుతూ తీర్మానం చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రాల లీకేజ్‌లు చోటుచేసుకుంటుండడంతో వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరో తీర్మానం చేసింది. పరీక్షల్లో అక్రమాల నివారణకు పార్లమెంట్‌లో కఠిన నిబంధనలతో ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేసింది. అయితే ప్రత్యేక హోదా చుట్టూనే రాజకీయం నడుస్తోంది.

Also Read: Lok Sabha Speaker Election: ఇండియా కూటమి సంచలనం.. దేశ చరిత్రలోనే తొలిసారి స్పీకర్‌ ఎన్నిక

ఎప్పటి నుంచో డిమాండ్?
గతేడాది తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని బిహార్‌ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. ఇప్పుడు ఎన్డీయే సర్కార్‌లో కీలక భూమిక ఉండడంతో నితీశ్‌ కుమార్‌ ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో జేడీయూ మూడో అతి పెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీకి బలం లేకపోవడంతో 12 మంది ఎంపీలు ఉన్న నితీశ్‌ కుమార్‌ సర్కార్‌ ఏర్పాటుకు మద్దతు ఇచ్చారు. జేడీయూ మద్దతు లేకుంటే మోదీ ప్రభుత్వం కూలే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే మద్దతు ఇచ్చి తమ రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ప్రాజెక్టులు నితీశ్‌ కుమార్‌ పొందుతున్నారు.

చంద్రబాబుపై ఒత్తిడి
ఎన్డీయే భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి పెరుగుతోంది. 2019 ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో తెగదెంపులు చేసుకున్న చంద్రబాబు 2024 ఎన్నికల్లో మళ్లీ చేతులు కలిపారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వంలో కీలకంగా మారారు. టీడీపీ ఎంపీలు లేకుంటే మోదీ ప్రభుత్వం కూలే ప్రమాదం ఉంది. మరి ఇలాంటి సమయంలో ఏపీకి రావాల్సిన వాటి విషయంలో చంద్రబాబు ఒత్తిడి చేయాలని డిమాండ్‌ వస్తోంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయమై నితీశ్ మాదిరి చంద్రబాబు అడగాలని సూచిస్తున్నారు. ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు, నిధులు వంటి వాటిని తీసుకువచ్చి ఏపీ అభివృద్ధికి సహకరించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News