RJD MLA allegations against Nitish Kumar: బిహార్ (Bihar) ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై (Nitish Kumar) ఆర్జేడీ ఎమ్మెల్యే రాజవంశీ మహతో సంచలన ఆరోపణలు చేశారు. నితీశ్ కుమార్ గంజాయి సేవిస్తారని ఆరోపించారు. గంజాయి కూడా మత్తు పదార్థం కిందకే వస్తుందని... దానిపై కూడా నిషేధం ఉందని... అలాంటప్పుడు నితీష్ ఆ వ్యసనాన్ని ఎందుకు వదులుకోవట్లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధంపై ఆదివారం (నవంబర్ 28) మీడియాతో మాట్లాడిన రాజవంశీ మహతో (RJD MLA) నితీశ్‌పై ఈ ఆరోపణలు చేశారు. మద్యపానానికి వ్యతిరేకంగా సీఎం నితీష్ రాష్ట్ర ప్రజలందరితో సామూహిక ప్రతిజ్ఞ చేయించిన రెండు రోజులకే ఆయనపై ఈ ఆరోపణలు రావడం గమనార్హం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిహార్‌లో మద్యపాన నిషేధం (Liquor ban in Bihar) కంటితుడుపు చర్య అని రాజవంశీ మహతో విమర్శించారు. మద్యపాన నిషేధం విషయంలో సీఎం నితీశ్ కుమార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. బిహార్‌లో పేరుకే మద్యపాన నిషేధమని.. రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో, నగరంలో మద్యం దొరుకుతోందని అన్నారు. బిహార్‌లో మద్యపాన నిషేధం అమలులో ఉంటే... మద్యం ముట్టుకోమని నితీశ్ (Nitish Kumar) ప్రజలతో బలవంతంగా ఎందుకు ప్రతిజ్ఞ చేయిస్తున్నారని ప్రశ్నించారు. అదే సమయంలో ఆయన మాత్రం తన గంజా అలవాటును ఎందుకు మానుకోవట్లేదని అన్నారు. బిహార్‌లో లిక్కర్ దందాను కొన్ని మాఫియాలు నడిపిస్తున్నాయని రాజవంశీ మహతో ఆరోపించారు. అమాయక పేద ప్రజలపై చర్యలు తీసుకునే పోలీసులు ఆ మాఫియాపై మాత్రం చర్యలు తీసుకోవట్లేదన్నారు.


నితీశ్‌పై రాజవంశీ మహతో చేసిన ఆరోపణలతో బిహార్ (Bihar) రాజకీయాలు మరోసారి వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికైతే జేడీయూ నేతలెవరూ మహతో వ్యాఖ్యలపై స్పందించలేదు. కాగా, శుక్రవారమే (నవంబర్ 26) సీఎం నితీశ్ మద్యపానానికి వ్యతిరేకంగా (Liquor) రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రజలు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. 'జీవితాంతం మద్యపానానికి దూరంగా ఉంటామని..' అంతా కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో కల్తీ మద్యం బారినపడి పదుల సంఖ్యలో మరణాలు సంభవించిన నేపథ్యంలో సీఎం ఈ ప్రతిజ్ఙ చేయించారు.


Also Read: Drones : మన డ్రోనులు మందులకు.. పాక్ డ్రోన్‌లు వాటికోసం : కేంద్ర మంత్రి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook