దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Price Today) గత మూడూ వారాలు పెరిగాయి. అయితే ఆదివారం ఒక్కరోజు ధరలు స్థిరంగా కొనసాగాయి. సోమవారం మళ్లీ బాదుడు మొదలైంది. ఈ క్రమంలో బుధవారం (జులై 1న) పెట్రో ధరల నుంచి వాహనదారులకు స్వల్ప ఊరట లభించింది. నేడు ధరలు ఏ మాత్రం పెరగలేదు, నిన్నటి ధరల వద్దే పెట్రోలు, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. జులైలో బ్యాంకు సెలవులు ఇవే..


జూన్ 29న ఆయిల్ కంపెనీలు లీటరు పెట్రోల్(Petrol Price Today)‌పై 0.05పైసలు .. డీజిల్‌పై 0.13పైసలు పెంచడం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.80.43 కాగా, డీజిల్‌ ధర రూ.80.53 చేరుకుంది. నిన్న కూడా ఇదే ధరలు కొనసాగనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ, మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఏమాత్రం తగ్గడంలేదు. పెట్రోలు, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుదలతో (Petrol Price Today) వినియోగదారులు లబోదిబోమంటున్నారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ