హైదరాబాద్: రైళ్లలో కంటెంట్ ఆన్ డిమాండ్ (కాడ్) సేవలను అందించడానికి రైల్‌టెల్ కార్పొరేషన్ సన్నద్ధమవుతుండటంతో రైలు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో నిరంతరాయంగా సినిమాలు, సంగీతం, ప్రదర్శనలు మరియు వివిధ వినోద కార్యక్రమాలను ఆస్వాదించవచ్చని భారతీయ రైల్వే అధికారులు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైల్‌టెల్ కార్పొరేషన్, మినీ-రత్నా PSU అనే సంస్థ దేశంలో అతిపెద్ద తటస్థ టెలికం సర్వీసు ప్రొవైడర్లలో ఒకటి. జీ ఎంటర్టైన్మెంట్ యొక్క అనుబంధ సంస్థ అయిన మార్గో నెట్‌వర్క్‌ను రైళ్లలో కంటెంట్ ఆన్ డిమాండ్ (కాడ్) సేవలను సులభతరం చేయడానికి ఎంపిక చేసింది. భారతీయ రైల్వేకు సంబంధించి అన్నీ ప్రీమియం, ఎక్స్‌ప్రెస్, మెయిల్, సబర్బన్ రైళ్లలో కంటెంట్ ఆన్ డిమాండ్ (కాడ్) నిబంధన అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ రెండేళ్లలో అమలు చేయబడుతుందని, సినిమాలు, వివిద ప్రదర్శనలు, విద్యా కార్యక్రమాలు వంటివి అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. 


రైళ్ళలో ప్రయాణించేవారు సాధారణంగా నెట్‌వర్క్ సమస్యల కారణంగా యూట్యూబ్ లేదా మరే ఇతర మాధ్యమాల్లో వీడియోలను చూడటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ సదుపాయంతో, కదిలే రైలులో అస్థిర మొబైల్ నెట్‌వర్క్ ఉన్నప్పటికీ ప్రయాణీకులు తమ రైలు ప్రయాణంలో నిరంతరాయంగా ఉచితంగా, చందా ఆధారిత వినోద సేవలను ఆస్వాదించవచ్చని అధికారులు తెలిపారు.


 2022 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని, ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడమే కాక, బహుళ మోనటైజేషన్ మోడళ్ల ద్వారా నాన్ ఫేర్ ఆదాయాన్ని పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ సౌకర్యం భారతీయ రైల్వేలోని మొత్తం 17 రైల్వే జోన్లలో అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. 


ప్రస్తుతం సుమారు 8,731 రైళ్లలో 3,003 ప్రీమియం, మెయిల్, ఎక్స్‌ప్రెస్ టు ఫ్రో 2,864 సబర్బన్ రైళ్లు సర్వీస్ రోల్ అవుట్ పరిధిలో ఉంచబడ్డాయని అధికారులు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..