New Driving license Rules: మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా..కొత్తగా తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ శుభవార్త మీకే. ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్సుల కోసం గంటల తరబడి నిరీక్షణ అవసరం లేదు. కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనల్ని(New Driving license rules) అమల్లోకి తెచ్చింది కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ. కొత్త నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం ఇకపై గంటల తరబడి నిరీక్షణ అవసరం లేదు. ఆర్టీవో కేంద్రాల వద్ద డ్రైవింగ్ టెస్టులు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఈ నిబంధనల ప్రకారం లైసెన్స్ కోరుకునే వ్యక్తి ఏదో ఒక డ్రైవింగ్ శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ పూర్తి చేసుకోవాలి. హైక్వాలిటీ డ్రైవింగ్ కోర్సు ద్వారా డ్రైవర్‌గా ట్రైనింగ్‌ను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ శిక్షణ కేంద్రాలలో సిమ్యులేటర్లు, దరఖాస్తుదారుల హైక్వాలిటీ ట్రైనింగ్ కోసం ప్రత్యేక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్(Driving Test Track) ఉంటాయి.గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్‌లో లైట్ మోటార్ వెహికల్ కోసం డ్రైవింగ్ కోర్సు ప్రారంభమైన తేదీ నుంచి గరిష్టంగా నాలుగు వారాల వ్యవధిలో 29 గంటలపాటు రన్ అవుతుందని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఈ కోర్సులో థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి.


మరోవైపు ఈ శిక్షణా కేంద్రాల్లో మీడియం, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ కోర్సుల కాలవ్యవధి 38 గంటలుంటుంది. ఇందులో థియరీ, ప్రాక్టికల్స్ రెండు దశలుంటాయి.  


Also read: ICMR: వ్యాక్సిన్ ఒక్క డోసుతో డెల్టా వేరియంట్ నుంచి రక్షణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook