Padma Awards: స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తోంది. ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులు ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే 2022 పద్మ అవార్డుల కోసం నామినేషన్లు, దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ప్రభుత్వం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత ప్రభుత్వం(Indian government) ప్రతి యేటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డుల (Padma Awards) కోసం నామినేషన్లు, సిఫారసు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డుల్ని అందించేందుకు అర్హులైన వ్యక్తుల్నించి దరఖాస్తుల్ని కోరుతోంది. నామినేషన్లు స్వీకరించేందుకు సెప్టెంబర్ 15 చివరి తేదీ అని కేంద్ర ప్రభుత్వం(Central government) ప్రకటించింది. నిర్దేశిత ఫార్మాట్‌లో ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవల్సి ఉంది. ఇతర వివరాలు కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.


పద్మ అవార్డుని పీపుల్స్ పద్మ(Peoples Padma)గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని..మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, నిస్వార్ధ సేవకుల్ని గుర్తించి సిఫారసు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ప్రతిభ, విజయాల ఆధారంగా కళలు, క్రీడలు, సంఘసేవ, విద్య, వైద్య, విజ్ఞాన శాస్త్ర సాంకేతిక, పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో విశిష్ట సేవలందించినవారికి పద్మ అవార్డులు అందించనున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అసాధారణ కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తుల్ని పీపుల్స్ పద్మకు నామినేట్ చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi) పిలుపునిచ్చారు. 


Also read: కేరళలో విజృంభిస్తున్న కరోనా వైరస్, కారణం అదేనంటున్న జెనోమిక్స్ కన్సార్టియం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook