Public Holiday: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. ఈ నవంబర్‌లో పెద్దగా సెలవులు లేకపోయినా ప్రాంతీయ సెలవులున్నాయి. దేశమంతా కాకపోయినా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. అదే విధంగా రేపు అంటే నవంబర్ 18వ తేదీన ఈ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవుందని గమనించగలరు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాంకులకు ప్రతి నెలా సెలవులుంటాయి. ఆర్బీఐ ఎప్పటికప్పుడు జారీ చేస్తుంటుంది. ప్రతి నెలా రెండు, నాలుగు శనివారాలు, నాలుగు ఆదివారాలు కలిపి 6 సెలవులు కచ్చితంగా ఉంటాయి. ఇవి కాకుండా జాతీయ, ప్రాంతీయ సెలవులుంటాయి. ప్రాంతీయ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. అదే విధంగా రేపు నవంబర్ 18న కర్ణాటకలో అన్ని బ్యాంకులు మూతపడనున్నాయి. కనకదాస్ జయంతి పురస్కరించుకుని కర్ణాటకలో రేపు ప్రభుత్వ , ప్రైవేట్ బ్యాంకులకు సెలవు ఉంది. అందుకే రేపు ఒకవేళ బ్యాంకు పనుంటే వాయిదా వేసుకోగలరు. లేకపోతే ఇబ్బంది ఎదురుకావచ్చు. 


కనకదాస్ జయంతి సందర్భంగా రేపు నవంబర్ 18న కర్ణాటకలో బ్యాంకులే కాకుండా స్కూల్స్, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవుంది. కనకదాస్ జయంత్రి రాష్ట్రంలో అతిపెద్ద పండుగ. మహా కవి, సాధువైన కనకదాస్ జయంతిని అత్యంత ఘనంగా జరుపుకుంటారు. కర్ణాటకలో ఈరోజు పబ్లిక్ హాలిడేగా ప్రకటిస్తుంటారు. అందుకే విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవు. 


నవంబర్ నెలలో ఇవాళ అంటే నవంబర్ 17 ఆదివారం సెలవు కాగా నవంబర్ 18 కనకదాస్ జయంతి సెలవుంది. ఇక నవంబర్ 23 నాలుగో శనివారం, నవంబర్ 24 ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుంది. 


Also read: Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.