Odisha Student Mixes Pesticide in Water to Force School Closure: ఒడిశాలోని బార్​గఢ్​ జిల్లాలో ఆశ్చర్య ఘటన జరిగింది. స్కూల్ కు సెలవులు ప్రకటించాలనే ఉద్దేశంతో 11వ తరగతికి చెందిన హాస్టల్‌ విద్యార్థి మంచినీటిలో పురుగు మందు కలిపాడు. అలా చేయడం సహా తోటి విద్యార్థులతో ఆ కలుషిత నీటిని తాగించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పురుగుల మందు కలిపిన నీళ్లు తాగిన 11, 12వ తరగతులకు చెందిన 19 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది వెంటనే వారందరిని ఆసుపత్రి తరలించారు.


ఏం జరిగిందంటే?


ఒడిశాలోని బార్​గఢ్ జిల్లా నువాపల్లికి చెందిన విద్యార్థి కామ్‌గావ్ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నాడు. కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతుండటం వల్ల డిసెంబర్ 19 నుంచి ఒడిశాలో లాక్‌డౌన్ విధిస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్​గా మారింది.


ఆ వార్తలను నిజమని నమ్మిన సదరు విద్యార్థి పాఠశాలను మూసేస్తే ఇంటికి వెళ్లొచ్చని సంబరపడ్డాడు. కానీ లాక్​డౌన్​ లాంటిది ఏమీ లేదని.. సెలవులు రావని తెలుసుకుని కలత చెందాడు. అయినప్పటికీ పాఠశాలను ఎలాగైనా మూసేసేలా చేస్తానని స్నేహితుల వద్ద చెబుతుండేవాడు.


ఈ క్రమంలోనే సదరు విద్యార్థి డిసెంబర్ 8న వాటర్‌ బాటిల్‌లో పురుగుమందు కలిపి హాస్టల్​లోని తన స్నేహితులకు అందించాడు. అవి తాగిన 19 మంది ఒంట్లో వికారంగా ఉండటం, కళ్లు తిరగడంతోపాటు వాంతులు చేసుకున్నారు.


సమాచారం అందుకున్న హాస్టల్​ సిబ్బంది.. విద్యార్థులను కామ్‌గావ్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడినుంచి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించిన వైద్యులు ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. వారిని పరిశీలనలో ఉంచామని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన పాఠశాల ప్రిన్సిపల్ ప్రేమానంద పటేల్.. సదరు బాలుడిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.    


Also Read: Gas Leak in Erode: రసాయన పరిశ్రమలో లీకైన విషవాయువు...ఒకరు మృతి, 13 మంది పరిస్థితి విషమం..


Also Read: Two Farmers Killed : నిరసన ప్రాంతం నుంచి ఇంటికి తిరిగొస్తుండగా ఇద్దరు రైతుల మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook