Two Punjab Farmers died while returning home from the Tikri border : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపైగా కొనసాగిన నిరసనలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతులు అంతా తమ ఇళ్లకు తిరుగుబాట పట్టారు. ఈ నేపథ్యంలో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాకు చెందిన ఇద్దరు రైతులు (Two Punjab Farmers died) రోడ్డు ప్రమాదంలో మరణించారు.
పంజాబ్‌కు చెందిన కొందరు రైతులు దిల్లీలోని టిక్రీ (Tikri) నిరసన ప్రాంతం నుంచి ట్రాక్టర్‌లో (Tractor) తమ స్వస్థలానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హర్యానాలోని హిసార్‌కు (Hisar) రైతుల ట్రాక్టర్ చేరుకుంటున్న తరుణంలో ఒక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు రైతులు చనిపోయారు.
ఢిల్లీ సరిహద్దు నిరసన ప్రాంతాల నుంచి పంజాబ్, (Punjab) హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులంతా ఇళ్లకు చేరుకుంటున్నారు. దీంతో సింఘూ ప్రాంతంతో పాటు ఇతర చోట్ల కాస్త ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు పోలీసులు (Police) ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తూనే ఉన్నారు. అయితే నిరసన ముగించి అన్నదాతలు ఇంటికొస్తున్న తరుణంలో ఇలాంటి విషాదం చోటుచేసుకోవడంతో రైతులు (Farmers) ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Revanth Reddy: కేసీఆర్‌కు డీఎన్ఏ టెస్ట్ చేయాలి-రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇక మూడు వ్యవసాయ బిల్లులను (Farm Law Repeal Bill) కేంద్రం రద్దు చేయడంతో పాటు కనీస మద్దతు ధర, రైతులపై (Farmers) నమోదైన కేసుల తొలగింపునకు కేంద్రం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏడాదికిపైగా కొనసాగిన తమ ఆందోళనను విరమిస్తున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది.
Also Read : Shocking video: వామ్మో.. రెండు తలల పాము.. రెండు ఎలుకలను ఒకేసారి ఎలా మింగేస్తుందో చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook