Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై ముగిసిన దర్యాప్తు, కారణమదేనా
Odisha Train Accident: ఒడిశా ఘోర రైలు ప్రమాదం మిగిల్చిన మహా విషాదం ఇంకా వెన్నాడుతూనే ఉంది. మూడు దశాబ్దాల్లో అతి పెద్ద రైలు ప్రమాద ఘటనగా మిగిలిన ఈ రైలు ప్రమాదం వెనుక కారణం అదేనని తెలుస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
Odisha Train Accident: ఒడిశా బాలాసోర్ రైల్వే ప్రమాద ఘటన మిగిల్చిన ఘోర కలి అంతా ఇంతా కాదు. ఏకంగా 293 మంది ప్రాణాలు కోల్పోగా, 1000 మంది గాయపడ్డారు. మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొన్న ఈ ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు తుది దశకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఓ వైపు రైల్వే సేఫ్టీ కమీషనర్ మరోవైపు సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి.
ఒడిశా బాలాసోర్ సమీపంలోని బహానగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు, యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒకదానికొకటి ఢీ కొన్న ఘటనలో 293 మంది మరణించగా 1000 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. గడిచిన మూడు దశాబ్దాల్లో ఇదే అతి పెద్ద రైలు ప్రమాదంగా ఉంది. ఈ ప్రమాదం వెనుక కారణాలపై అంతు తేల్చేందుకు ఓ వైపు రైల్వే సేఫ్టీ కమీషనర్ మరోవైపు సీబీఐ దర్యాప్తు ప్రారంభించాయి. ఈ ప్రమాదం చాలా ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సి ఉంది.
అసలు మెయిన్ ట్రాక్‌లో వెళ్లాల్సిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్..గూడ్స్ రైలు ఆగి ఉన్న లూప్ లైన్‌లోకి ఎలా వెళ్లింది, ఎందుకు వెళ్లిందనేది ఇప్పటికీ అనుమానాస్పదమే. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణమని కొందరు వాదిస్తుంటే, దీనివెనుక విద్రోహ కోణముందని మరికొందరు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన రైల్వే సేఫ్టీ కమీషనర్ మాత్రం తన నివేదికలో సిగ్నలింగ్ విభాగపు ఉద్యోగుల తప్పిదమని తేల్చింది. అందుకే ప్రమాదానికి మానవ తప్పిదం కారణమని ప్రత్యేకించి చెప్పింది.
రైల్వే సీఆర్ఎస్ నివేదికలో ఏముంది
వాస్తవానికి భద్రతా కారణాలతో డిజైన్‌లో మార్పులు చేసిన తరువాత కూడా ఆ భద్రతా ప్రమాణాలు అనుసరించని కొందరు అధికారుల వల్లే ఈ ప్రమాదం జరిగిందని నివేదికలో వెల్లడైంది. సర్క్యూట్‌లో చేసిన మార్పుచేర్పుల్ని అమలు చేయడంలో లేదా గుర్తించడంలో సెంట్రల్ డయాగ్రమ్ విఫలమైనా ప్రతి యేటా చేసే తనిఖీల్లో ఎవరూ పట్టించుకోలేదని నివేదిక తెలిపింది. ఇది ఏ ఒక్కరి తప్పు కాదని..దాదాపు ఐదారుగురు బాధ్యులని నివేదిక స్పష్టం చేసింది. రైల్వే సేఫ్టీ కమీషనర్ సిబ్బంది నిర్లక్ష్యం ప్రధాన కారణంగా నివేదికను రూపొందించింది. మరోవైపు సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.
Also read: Heavy Rains Alert: మరో రెండ్రోజులు గుజరాత్‌లో భారీ వర్షాలు, 11 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook