Odisha Train Accident track Restored: దశాబ్దకాలంలోనే అతి పెద్ద రైలు ప్రమాదం జరిగి ఇవాళ్టికి మూడవ రోజు. అత్యంత భయంకరంగా మూడు రైళ్లు ఢీ కొన్న ఘటనలో మృతుల సంఖ్య ఎంతనేది అధికారికంగా తేలింది. మరోవైపు ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒడిశా బాలాసోర్ సమీపంలోని బహానగ బజార్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో 275 మంది మరణించినట్టు అధికారింగా తేల్చారు. ప్రమాదం జరిగిన 51 గంటల్లో ట్రాక్‌ను పునరుద్ధరించారు. చిట్ట చివరి భోగీని కూడా తొలగించిన తరువాత దెబ్బతిన్న ట్రాక్ మరమ్మత్తులు పూర్తి చేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దగ్గరుండి సహాయక చర్యలు, ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి చేయించారు.


భారీ కోచ్‌లను పూర్తిగా తొలగించారు. ట్రాక్ మరమ్మత్తులు చేసి విశాఖపట్నం-రూర్కెలా గూడ్స్ రైలును పట్టాలకెక్కించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జెండా ఊపి రైలు ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి బహానగ బజార్ రైల్వేస్టేషన్ డౌన్ లైన్ ట్రాక్‌లో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుతానికి డీజిల్ రైళ్లు మాత్రమే నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.


ఎలక్ట్రిక్ కేబుల్ పనులు పునరుద్ధరణ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ పనులు పూర్తయ్యేందుకు మరో 3 రోజులు సమయం పట్టవచ్చు. ఆ తరువాత పూర్తి స్థాయిలో అన్ని రకాల రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 1500 మంది కార్మికులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు 48 గంటలుగా నిర్విరామంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. అందరి కృషితో ప్రమాదం జరిగిన 51 గంటల తరువాత రెండు ట్రాక్‌లు పునరుద్ధరించి రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 


అత్యంత భయంకరమైన ఒడిశా రైలు ప్రమాద ఘటన అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఓ వైపు మృతదేహాల్ని వెలికి తీయడం , మరోవైపు క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించి సరైన చికిత్స అందే ఏర్పాట్లు చేయడం ఆ తరువాత ట్రాక్ పునరుద్ధరణ పనులు ఇలా క్రమపద్ధతిలో చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతానికి డీజిల్ రైళ్ల రాకపోకలకు అనుమతించారు. మరో 2-3 రోజుల్లో ఎలక్ట్రిక్ రైళ్లు కూడా ప్రారంభం కానున్నాయి. 


Also Read: Bihar Bridge Collapse: నిర్మాణంలోనే గంగా నదిలో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియోలు వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి