Omicron: చాప కింద నీరులా ఒమిక్రాన్... ఢిల్లీలో కొత్తగా మరో 10 కేసులు...
Omicron cases in India: ఒమిక్రాన్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా మరో 10 ఒమిక్రాన్ (Omicron) కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి చేరింది.
Omicron cases in India: ఢిల్లీలో కొత్తగా మరో 10 ఒమిక్రాన్ (Omicron) కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి చేరింది. వీరిలో 10 మంది ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో 40 ఒమిక్రాన్ అనుమానిత కేసులు ఉండగా.. వీరిలో 38 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ 38 మంది లోక్ నాయక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఈ వివరాలు వెల్లడించారు.
అటు కర్ణాటకలోనూ (Karnataka) మరో ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8కి చేరింది. కొత్తగా ఒమిక్రాన్ బారినపడ్డవారు ఇటీవల యూకె, ఢిల్లీ, నైజీరియా, సౌతాఫ్రికా నుంచి తిరిగొచ్చినట్లుగా గుర్తించామని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 90 ఒమిక్రాన్ కేసులు (Omicron cases in India) నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 32 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, గుజరాత్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక కరోనా కేసుల విషయానికి వస్తే... కొత్తగా మరో 7974 కేసులు నమోదవగా 343 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 87,245 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇప్పటివరకూ అత్యధికంగా యూకెలో 11,708 ఒమిక్రాన్ కేసులు (Omicron) నమోదయ్యాయి. డెన్మార్క్‌లో 9009, నార్వేలో 1792, సౌతాఫ్రికాలో 1134 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కారణంగా ఇటీవలే యూకెలో తొలి మరణం సంభవించిన సంగతి తెలిసిందే. దీంతో ఒమిక్రాన్ వ్యాప్తి పట్ల ప్రపంచ దేశాల్లో మరింత ఆందోళన పెరిగింది. రోజురోజుకు చాప కింద నీరులా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారితీస్తుందోనన్న ఆందోళన వెంటాడుతోంది.
Also Read: 156 Kidney stones: ఆ పేషెంట్ కిడ్నీ నుంచి 156 రాళ్లు తొలగించిన వైద్యులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook