156 Kidney stones removed from single patient: హైదరాబాద్‌లోని (Hyderabad) ప్రీతి యూరాలజీ, కిడ్నీ ఆసుపత్రి వైద్యులు ఓ పేషెంట్ కిడ్నీలో ఉన్న 156 రాళ్లను విజయవంతంగా తొలగించారు. 350 గ్రాముల బరువున్న ఈ రాళ్లను తొలగించేందుకు దాదాపు 3 గంటల పాటు సర్జరీ నిర్వహించారు. భారత్‌లో ఒక పేషెంట్ కిడ్నీ నుంచి అత్యధిక స్టోన్స్‌ను తొలగించిన కేసుగా వైద్యులు దీన్ని పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని తాజ్ దక్కన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు ఈ సర్జరీ వివరాలు వెల్లడించారు.
కర్ణాటకలోని హుబ్లీకి చెందిన బసవరాజు అనే టీచర్‌కు ఈ సర్జరీ (Kidney stones) జరిగింది. ఇటీవల ఆయనకు పొత్తికడుపులో హఠాత్తుగా నొప్పి రావడంతో హైదరాబాద్‌లోని ప్రీతి యూరాలజీ ఆసుపత్రిలో చేరారు. అక్కడి వైద్యులు బసవరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించగా... మూత్రకోశం వద్ద ఉండాల్సిన కిడ్నీ పొత్తికడుపులో ఉన్నట్లు గుర్తించారు. దీన్ని ఎక్టోపిక్‌గా పేర్కొన్నారు.
శరీరంపై పెద్ద కోత పెట్టి సర్జరీ (Surgery) చేయకుండా... దానికి బదులు ల్యాప్రోస్కోపీ, ఎండోస్కోపీ ద్వారా చిన్న కీ హోల్ మాత్రమే చేసి సర్జరీ నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు సర్జరీ చేసి 350 గ్రా. బరువున్న 156 రాళ్లను తొలగించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ పేషెంట్ కోలుకున్నాడని... ఎప్పటిలాగే తన పనులు చేసుకుంటున్నాడని చెప్పారు. నిజానికి అతనికి చాలా కాలం క్రితమే స్టోన్స్ ఏర్పడి ఉంటాయని.. హఠాత్తుగా నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరాడని చెప్పారు.
Also Read: RRR Pre Release Event: ముంబయి వేదికగా ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook