7 Day Mandatory Home Quarantine For All International Arrivals In India: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా.. ఇప్పడు మళ్లీ పంజా విసురుతోంది. ఒమిక్రాన్ (Omicron) రూపంలో కొత్త వేరియెంట్ బంయాందోళనలకు గురిచేస్తోంది. ఒమిక్రాన్‌ కారణంగా దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. గురువారం ఇటలీ నుంచి వచ్చిన పంజాబ్‌ వచ్చిన ఓ ఛార్టర్డ్‌ విమానంలో 125 మంది ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. విదేశాల నుంచి భారత్‌ (India)కు వచ్చే ప్రయాణికులకు ప్రస్తుతం అమలు చేస్తోన్న మార్గదర్శకాలను శుక్రవారం సవరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒమిక్రాన్‌ వేరియంట్‌ ముప్పు ఎక్కువ ఉన్న దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి నుంచి వచ్చే ప్రయాణికులు భారత్‌కు వచ్చిన తర్వాత తప్పనిసరిగా 7 రోజుల పాటు క్వారంటైన్‌ (7 Day Mandatory Home Quarantine)లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం (Central Govt) ఈరోజు ప్రకటించింది. క్వారంటైన్‌ ముగిసిన తర్వాతి రోజు (8వ రోజు) కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది. ప్రయాణానికి ముందు ప్రయాణికులు తప్పనిసరిగా 72 గంటల లోపు చేయించుకున్న ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల నెగటివ్ రిపోర్ట్ సమర్పించాలి. ఈ కొత్త మార్గదర్శకాలు జనవరి 11 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry of India) స్పష్టం చేసింది. 


Also Read: ICC T20I New Rule: టీ20ల్లో కొత్త రూల్‌.. ఇకపై స్లో ఓవర్​రేట్​ వేస్తే ఓ ఫీల్డర్ ఔట్!!


కేంద్రం తాజా మార్గదర్శకాలు ఇవే:
# విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫామ్‌ను ఫీల్ చేయాలి. పూర్తి సమాచారం ఇచ్చిన వారికే విమానంలోకి అనుమతి.


# ప్రయాణికులు తప్పనిసరిగా 72 గంటల లోపు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకున్న నెగెటివ్‌ రిపోర్ట్ అప్‌లోడ్‌ చేయాలి.


# వైరస్ ముప్పు ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి భారత్‌ చేరుకున్న తర్వాత కరోనా పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షల కోసం ప్రయాణికులు ముందుగానే ఎయిర్ సువిధ పోర్టల్‌లో బుకింగ్‌ చేసుకోవచ్చు.


# 'ఎట్‌ రిస్క్‌' దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినప్పటికీ.. 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. 8వ రోజు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. ఆ రిపోర్ట్‌ను ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.


# ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చే వారికీ పాజిటివ్‌ వస్తే.. ప్రొటోకాల్స్‌ ప్రకారం ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉండాలి. వారి శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించాలి.


# 'ఎట్‌ రిస్క్' కాని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లో రాండమ్‌ పరీక్షలు చేసుకోవాలి. నెగెటివ్‌ వచ్చిన ప్రయాణికులు కూడా 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. ఎనిమిదో రోజు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి. రిపోర్ట్‌ను ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఒక వేళ పాజిటివ్‌ వస్తే.. వీరి శాంపిల్స్‌ను కూడా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించాలి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Also Read: Hair Growth Tips: నిగనిగలాడే జట్టు కోసం పాటించాల్సిన ఆహార నియమాలు మీకోసం!


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి