Omicron in Surat: గుజరాత్ లోని సూరత్ లో కరోనా కొత్త వేరియంట్ కలవరం సృష్టిస్తోంది. ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి సూరత్ వచ్చిన ఓ వ్యక్తికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం అతడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఒమిక్రాన్ కేసు నమోదు నేపథ్యంలో తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటామని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ హెల్త్ కమిషనర్ డాక్టర్ ఆశిష్ నాయక్ తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

“వారం క్రితం.. దక్షిణాఫ్రికా నుంచి సూరత్ వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. అయితే మూడు సార్లు చేసిన పరీక్షల్లోనూ కరోనా సోకినట్లు తేలగా.. అతడి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు. దీంతో అది ఒమిక్రాన్ అని తేలింది. అయితే ఢిల్లీలో కరోనా టెస్ట్ చేయించుకున్న క్రమంలో అతడికి నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత అహ్మదాబాద్ లో నిర్వహించిన పరీక్షల్లోనూ నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మూడు వారాల తర్వాత మూడో సారి కరోనా పరీక్ష నిర్వహించగా.. అందులో అతడికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకినట్లు తెలిసింది. ప్రస్తుతం అతడు సూరత్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు" అని  డాక్టర్ ఆశిష్ నాయక్ వెల్లడించారు. 


ప్రస్తుతం.. దేశంలో ఒమిక్రాన్ బారిన పడిన బాధితుల సంఖ్య మొత్తం 41కి చేరింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 63 దేశాలకు ఈ వేరియంట్ విస్తరించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇది డెల్టా వేరియంట్​ను త్వరలోనే అధిగమించేలా ఉందని అభిప్రాయపడింది. 


Also Read: Modi Night Visit: వారణాసి రోడ్లపై అర్ధరాత్రి యోగీతో కలిసి..ప్రధాని మోదీ బిజీబిజీ


Also Read: Terror Attack: పోలీసుల బస్సుపై ఉగ్రదాడి...ముగ్గురు మృతి, శ్రీనగర్‌లో ఘటన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook