Omicron infected man from South Africa escapes quarantine: బోర్డు మీటింగ్ కోసం దక్షిణాఫ్రికా (South Africa) నుంచి భారతదేశానికి వచ్చిన 66 ఏళ్ల వ్యక్తికి కరోనా నెగటివ్ రావడంతో క్వారంటైన్‌ (Quarantine)లో ఉంచగా.. అక్కడి నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ల్యాబ్ నుంచి నెగెటివ్ సర్టిఫికేట్ తీసుకుని భారత్ విడిచి పారిపోవడం గమనార్హం. అయితే పారిపోయిన వ్యక్తితో సహా హోటల్ సిబ్బందిపై బెంగళూరు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. కర్ణాటక ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 2020 కింద వారందరిపై కేసు నమోదైంది. అయితే ఆ తప్పించుకున్న వ్యక్తి ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. విషయంలోకి వెళితే.... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

66 ఏళ్ల దక్షిణాఫ్రికా (South Africa)కు చెందిన ఓ వ్యక్తి నవంబర్ 20న బెంగళూరులో ల్యాండ్ అయ్యాడు. అక్కడి విమానాశ్రయంలో కరోనా టెస్ట్ చేయగా.. అతడికి కరోనా నెగటివ్ అని తేలింది. పాజిటివ్ వచ్చిన వెంటనే అతడిని బెంగళూరులోని ఓ హోటల్లో (Bengaluru Hotel) క్వారంటైన్‌ (Quarantine)లో ఉంచారు. 14 రోజులు తప్పనిసరిగా రూంలోనే ఉండాలని హెచ్చరించారు. అతడి నమూనాలను జెనోమిక్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. ఆ నివేదిక రాకముందే.. ఏడు రోజుల (నవంబర్ 27) తర్వాత బెంగళూరులోని ఓ ప్రైవేట్ ల్యాబ్ నుంచి నెగెటివ్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్లిపోయాడు. హోటల్ సిబ్బందికి, విమానాశ్రయంలోని అధికారులకు నెగెటివ్ సర్టిఫికేట్ చూపించాడు. 


Also Read: IND vs SA: కోహ్లీ ఆలోచనా విధానాన్ని అంచనా వేయడం కష్టం.. అశ్విన్‌ను తీసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు!!


నవంబర్ 27న బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయం నుంచి ముందుగా దుబాయ్ వెళ్లి.. అక్కడి నుంచి దక్షిణాఫ్రికాకు వెళ్లిపోయాడట. ఆ వ్యక్తి జోహన్నెస్‌బర్గ్‌లోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీకి అధిపతి అని సమాచారం తెలుస్తోంది. అయితే తాజాగా రిపోర్ట్ రాగా.. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ అతడికి సోకింది. దీంతో అప్రమత్తమైన డాక్టర్లు హోటల్‌కు వెళ్లగా.. అతడు ఎప్పుడో వెళ్లిపోయాడని సిబ్బంది చెప్పారు. దాంతో పారిపోయిన సదరు వ్యక్తితో సహా హోటల్ సిబ్బందిపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. శివాజీనగర్‌లోని బీబీఎంపీ డాక్టర్ నవీన్ కుమార్ హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు నమోదు చేశారు. 


Also Read: Girls Molested in UP: ఆహారంలో మత్తు మందు కలిపి 17 మంది బాలికలపై ప్రిన్సిపల్ అత్యాచారం!


మరోవైపు దక్షిణాఫ్రికా (South Africa)లో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్‌.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు పాకింది. భారత్‌లోనూ కొత్త వేరియంట్ కొన్ని రాష్ట్రాలను కలవర పెడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ టెన్షన్ మొదలైంది. సంత బొమ్మాలి మండలం ఉమిలాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. బాధితుడు ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి రావడమే అందరిలో ఆందోళన నెలకొంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook