Omicron scare: దేశంలో ఒమిక్రాన్ కలవరం- రాజస్థాన్‌లో ఓ వ్యక్తి మృతి!
Omicron scare: దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనలు కలిగిస్తోంది. రాజస్థాన్‌లో ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిన ఓ వ్యక్తి శుక్రవారం మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Omicron scare: దేశంలో కరోనా ఒమిక్రాన్ భయాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒక్క రోజులోనే 309 ఒమిక్రాన్ (Omicron new cases) కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 1,270కి చేరినట్లు వైద్య, ఆరోగ్య విభాగం (Omicron tatal cases in India) వెల్లడించింది.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన 73 ఏళ్ల వృద్ధుడికి ఈ నెల 25 ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలగా.. ఆ వ్యక్తి శుక్రవారం మృతి చెందినట్లు స్థానిక ఆరోగ్య విభాగం (Omicron Positive Man died in Rajasthan) వెల్లడించింది. కరోనా సోకకన్నా ముందు నుంచే ఆ వ్యక్తికి బీపీ, షుగర్ వ్యాధులు కూడా ఉన్నట్లు తెలిపింది.
నిజానికి ఈ నెల 21న ఆ వ్యక్తికి కొవిడ్ నెగెటివ్‌గా తేలగా.. డిసెంబర్ 25న చేసిన పరీక్షల్లో ఒమిక్రాన్ పాజిటివ్‌గా గుర్తించారు వైద్యులు. అయితే నిమోనియా సోకడం కారణంగానే ఆ వ్యక్తి మృతి చెంది ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు.
ఒమిక్రాన్ కారణంగా ఇదే తొలి మరణమా లేదా రెండోదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
మహారాష్ట్రలో ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిన 52 ఏళ్ల వ్యక్తి ఇటీవల.. గుండె పోటుతో మరణించాడు. అయితే అతడి మరణానికి కరోనా కారణం కాదని మహారాష్ట్ర వైద్యులు చెబుతున్నారు. గుండె పోటు కారణంగానే ఆ వ్యక్తి మృతి చెంది ఉండొచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ తొలి మరణంపై సందిగ్ధత నెలకొంది.
దేశంలో కరోనా కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఒక్క రోజులో 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రెండు నెలల తర్వతా ఈ స్థాయిలో కేసులు పెరిగాయి. యాక్టివ్ కేసులు కూడా మళ్లీ 91 వేలు దాటాయి. ఈ పరిస్థితులన్నీ కొవిడ్ థార్డ్ వేవ్ రావచ్చన్న అంచనాలకు బలాన్నిస్తున్నాయి.
Also read: Born on Same Day: ఆ ఊర్లో జనవరి 1వ తేదీన 80 శాతం మంది పుట్టారంట.. అదెక్కడో తెలుసా?
Also read: Pondicherry Night curfew : పాండిచ్చేరిలో అదొక్క రోజు తప్ప జనవరి 31 వరకు నైట్ కర్ఫ్యూ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook