Centre to rethink on resuming international flights: అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుమతించే విషయంపై కేంద్రం పునరాలోచనలో పడింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ భయాలు (Omicron variant ) వెంటాడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై సమీక్ష నిర్వహించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముక్యంగా భారత్​కు వచ్చే ప్రయాణికుల స్టార్డర్డ్​ ఆపరేటింగ్ ప్రొసీజర్​ (ఎస్​ఓపీ)ని కూడా సమీక్షించనుంది కేంద్రం. ఇందులో రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది.


డిసెంబర్ 15 నుంచి అనుమతించాలని నిర్ణయం కానీ..


చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్​, బంగ్లాదేశ్​, బ్రిటన్​, సింగపూర్​, న్యూజిలాండ్, హాంకాంగ్, జింబాబ్వే, మారిషస్​,బోట్స్​వానా, ఇజ్రాయెల్​ సహా 14 దేశాలకు మినహా.. మిగతా దేశాల నుంచి వచ్చే ప్రాయాణికులను దేశంలోకి అనుమతించాలని కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. 


కొత్త వేరియంట్​కు ప్రధాన కేంద్రమైన దక్షిణాఫ్రికాకు (India tranve Ban on South Africa) మాత్రం విమాన సేవలు పూర్తిగా నిలిపివేసే యోచనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. 


అయితే తాజాగా.. పరిస్థితులు వేగంగా మారతున్నందున ఈ విషయంపై కేంద్రం మరోసారి ఆలోచించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండం, ఇప్పటికే ఆఫ్రీకాయేతర దేశాల్లో ఈ కేసులు బయటపడటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.


ఆంక్షల దిశగా మరిన్న దేశాలు..


అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాలని భావిస్తున్న దేశాల జాబితాలో భారత్​ మాత్రమే కాదు.. మరిన్న దేశాలు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్ 14 రోజులు అంతర్జాతీయ విమానాలను నిలిపివేసే యోచనలో ఉంది. మరిన్ని దేశాలు కూడా ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయి.


Also read: Nitish Kumar: సీఎం నితీశ్‌ గంజాయి సేవిస్తారు-ఆర్జేడీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు


Also read: Drones : మన డ్రోనులు మందులకు.. పాక్ డ్రోన్‌లు వాటికోసం : కేంద్ర మంత్రి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook