Up election 2022: ఉత్తర్ ప్రదేశ్​లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నేతలు పార్టీలు మారే ప్రక్రియ జోరుగా (Uttar Pradesh Assembly Election 2022) సాగుతోంది. అధికార బీజేపీని గద్దె దించాలని ఎస్​పీ(సమాజ్​వాదీ పార్టీ), బీఎస్​పీలు (బహుజన్ సమాజ్​వాదీ పార్టీ) తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అటు బీజేపీ కూడా మరోసారి ఉత్తర్​ ప్రదేశ్​లో అధికారం చలాయించాలని ఎత్తుకు పై ఎత్తులు రచిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ ప్రక్రియలో బీజేపీకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. కీలక నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం బీజేపీని వీడేందుకు ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న వార్తలే ఇందుకు కారణం. ఇక ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తూ.. యూపీ కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్​ మౌర్య తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా తాజాగా మరో మంత్రి దారా సింగ్ చౌహాన్​ కూడా తన పదవిని వీడుతున్నట్లు ప్రకటించారు. గవర్నర్​కు రాజీనామాను కూడా పంపారు.


ఎస్​పీలోకి నేతలు?


మంత్రి పదవికి రాజీనామా చేసిన స్వామి ప్రసాద్​ త్వరలోనే బీజేపీ వీడి.. మరో ఎస్​పీలో చేరే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.


అయితే ఈ విషయంపై శుక్రవారం క్లారిటీ ఇస్తానని స్వామి ప్రసాద్​ మౌర్య వెల్లడించారు. ప్రస్తుతానికి బీజేపీని వీడలేదని.. అదే విధంగా ఎస్​పీలో చేరలేదని కూడా చెప్పారు.


తాన రాజీనామా యూపీ బీజేపీలో సంక్షోభం సృష్టిస్తుందని పేర్కొన్నారు స్వామి ప్రసాద్​ మౌర్య. మరింత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా త్వరలో తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు.


ఇప్పటికే మౌర్యతో పాటు.. నలుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడుతున్నట్లు ప్రకటన చేయడం గమనార్హం. మౌర్యతో పాటే తమ ప్రయాణం అని చెప్పారు.


తాజాగా దారా సింగ్ చౌహన్​ రాజీనామాతో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అయితే ఆయన రాజీనామాకు కారణాలు, ఏ పార్టీలో చేరుతారు అనే విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.


రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు..


ఇద్దరు మంత్రులు సహా నలుగురు ఎమ్మెల్యేలు, పలువురు బీజేపీని వీడటం అనేది ఇలాంటి పరిస్థితుల్లో చాలా పెద్ద విషయమని అంటున్నారు విశ్లేషకులు, ముఖ్యంగా మౌర్యకు యూపీలో మంచి రాజకీయ అనుభవం ఉంది.


ఇంతకు ముందు బీఎస్​పీలో ఉన్నారు మౌర్య. అయితే ఆ పార్టీలో టికెట్ల కుంభకోణం జరుగుతోందని.. అందుకే పార్టీ వీడుతున్నట్లు చెప్పుకొచ్చారు. 


ఇక ఇప్పుడు బీజేపీ వీడేదుకు అనేక కారణాలు ఆయన వెల్లించారు. వెనుకబడిన వర్గాలను యోగీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసుతున్నట్లు ఆరోపించారు. ఈ పరిణామాలల్ని బీజేపీకి ప్రతికూలంగా మారొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.


Also read: Covid-19 Update: రాష్టంలో 1,700 మంది పోలీసులకు కరోనా.. అప్రమత్తమైన అధికారులు


Also read: Covid 19: బీజేపీ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం.. 50 మందికి పాజిటివ్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook