One more Omicron case found in Mumbai's Dharavi area: ఒమిక్రాన్‌ ఇప్పుడు భారత్‌ను భయపెడుతోంది. ఒకవైపు ముంబైలో ఒమిక్రాన్‌ సోకిన తొలి వ్యక్తి పూర్తిగా కోలుకున్నాడు అనే గుడ్ న్యూస్ వచ్చింది.. మరో వైపు ముంబైలోఓ మరో ఒమిక్రాన్‌ నమోదైందనే బ్యాడ్ న్యూస్ కూడా వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబైలోని ధారవి ప్రాంతంలో కొత్తగా ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఆ వ్యక్తి తాజాగా.. టాంజానియా నుంచి ముంబైకి తిరిగి వచ్చాడని తేలింది. బాధితుడు స్థానికల సెవెన్‌హిల్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. 



 


Also Read : Omicron cases: దేశంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు- 25కు చేరిన మొత్తం సంఖ్య!


కాగా.. ముంబైలోని సెవెన్‌ హిల్స్‌ హాస్పిటల్‌ నుంచి ఒమిక్రాన్‌ సోకిన తొలి వ్యక్తి తాజాగా డిశ్చార్జి అయ్యారు. ఇక ముంబైలో ఒమిక్రాన్‌ సోకిన రెండో వ్యక్తి కూడా కోలుకొంటున్నారు. ముంబైలో కొత్తగా ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాలేదు అనుకునే తరుణంలో ఇప్పుడు.. మరో కేసు బయటపడింది. ముంబైలో కోవిడ్ కొత్త వేరియంట్‌ బారిన పడిన వారి సంఖ్య పది మాత్రమే ఉండేది. ఇప్పుడు క్రమంగా ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది. 


Also Read : Railway New Rules: ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణకై రైల్వేశాఖ కొత్త నిబంధనలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook