One Nation one Election:మన దేశంలో  లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహించేందుకు  ఉద్దేశించిన వన్ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ బిల్లును నేడు పార్లమంట్ లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. ఈ రోజు లోక్ సభలో జమిలి ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల బిల్లును న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాంమేఘవాల్ ప్రవేశపెట్టనున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో ఈ బిల్లుకు లోక్ సభ లో మూడింటి రెండొంతల మంది మద్ధతు అవసరం. ప్రస్తుతం లోక్ సభలో ఈ బిల్లు నెగ్గాలంటే 361 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం ఎన్డీయేకు లోక్ సభలో 293 మంది ఎంపీల మద్దతు ఉంది. మరో 20 మంది ఇతర పార్టీల ఇండిపెండ్స్ ఎంపీల మద్దతు ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు బిల్లు ఆమోదానికి లోక్ సభలో 361 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం లోక్ సభలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. అయితే ఈ బిల్లును ముందుగా ఈ బిల్లును సోమవారం ప్రవేశపెడతారనే వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా లోక్ సబ రివైజ్ చేసిన బిజినెస్ లో ఈ బిల్లులు లేకపోవడంతో ఈ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టరనే వాదనలు వినపడ్డాయి. అయితే అనూహ్యంగా ఈ రోజు ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారు.


‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ పేరుతో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర లా మినిష్టర్ అర్జున్ రామ్ మేఘ్ వల్ ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఈ బిల్లు జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ ) సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయవల్సిందిగా సభాపతికి సిఫార్స్ చేస్తారు. ఈ జాయింట్ పార్లమెంట్ కమిటీలో ఆయా పార్టీలకు ఉండే సంఖ్యను బట్టి సభ్యులను డిసైడ్ చేసే అవకాశాలున్నాయి. ఈ రోజే సభ్యులను ఎలెక్ట్ చేయనున్నారు. ఒక వేళ పార్టీలు తమ పార్టీ తరుపున సభ్యులను సూచించకపోతే.. అందులో సభ్యత్వాన్ని కోల్పోతారు. ఈ జాయింట్ పార్లమెంటరీ సంఘం పదవీ కాలం గరిష్ఠంగా 90 రోజులు ఉంటుంది. ఆ తర్వాత దీన్ని పొడిగించే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించిన రెండు బిల్లులను కేంద్ర కేబినేట్ లాస్ట్ వీక్ ఆమోదించిన సంగతి తెలిసిందే కదా.


129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు 2024ను కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు అసెంబ్లీలున్న ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ శాసనసభలకు చెందినది. ఏదైనా అసెంబ్లీ ఎలక్షన్స్ తో పాటు లోక్ సభకు ఎన్నికలు నిర్వహించలేకపోతే.. ఆ తర్వాత వాటిని జరిపే వీలు జమిలి ఎన్నికల బిల్లులో ఉంటుంది. దీనిపై రాష్ట్రపతి ఆదేశాలు కంపల్‌సరీ.


ఏదైనా శాసన సభ ఎలక్షన్స్ కండక్టర్ చేయలేమన్నపుడు దాన్ని రాష్ట్రపతికి సిఫార్సు చేసే అవకాశం 129వ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ 2 క్లాజ్ 5 నిర్దేశిస్తుంది. ప్రెసిడెంట్ అధికారంలో వాటిని తర్వాత కూడా నిర్వహించే అవకాశం ఉంది.అయితే.. జమిలీ ఎలక్షన్స్ వల్ల   ప్రజాధనం, సమయం ఆదా అవుతుందని  కేంద్రం చెబుతోంది. ఒకేసారి ఎన్నికల వల్ల  అభివృద్ధి పనులు నిరాటంకంగా జరుగుతాయంటోంది. ఎన్నికల విధులకు మానవ వనరుల వినియోగం తగ్గి ప్రభుత్వ ఉద్యోగుల సేవలు ప్రజలకు మరింతగా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయంటోంది. మొత్తంగా ఈ కారణాల  రీత్యా జమిలి ఎన్నికల నిర్వహణ దేశానికెంతో అవసరమని బిల్లులో అభిప్రాయపడింది.


లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు  జమిలి ఎన్నికల అమలు కోసం రాజ్యాంగంలో కొత్తగా ఆర్టికల్‌  82Aను  చేర్చాల్సి ఉంటుంది. అదే సమయంలో పార్లమెంటు పదవీ కాలంలో మార్పు కోసం ఆర్టికల్‌ 83ని, శాసభసభల పదవీ కాలం సవరణకు..ఆర్టికల్‌ 172ని, ఎన్నికల నిబంధనల రూపకల్పన కోసం పార్లమెంటుకు అధికారం కల్పించే.. ఆర్టికల్‌ 327ని సవరణ చేయాల్సి ఉంటుంది.


జమిలి ఎన్నికల చట్టం ప్రకారం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ప్రతి 5 యేళ్లక ఒకసారి మాత్రం ఒకసారి ఎలక్షన్స్ కండక్టర్ చేస్తారు.  అప్పటి వరకు పాలన కొనసాగాల్సిన ప్రభుత్వాలు ఏదైనా పరిస్థితుల్లో కూలిపోయినా, లేదా రద్దయినా... ఆయా అసెంబ్లీలు, లోక్‌సభకు మాత్రమే... మిగిలి ఉన్న కాలం కోసమే మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ గడువు ముగిసిన తర్వాత అన్ని శాసనసభలు, లోక్‌సభతో పాటే జమిలి ఎన్నికలు జరుగుతాయి.


ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..


ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.