One Nation One Election: జమిలి ఎన్నికలకు మేం సిద్ధమే: సీఈసీ
One Nation One Election: తాజాగా మరోసారి జమిలి ఎన్నికల ప్రస్తావన తెరమీదకి వచ్చింది. అయితే ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయా.. వచ్చే సార్వత్రిక ఎన్నికలు అలాగే జరగనున్నాయా.. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా స్పందించారు.
One Nation One Election: భారత రాజకీయాల్లో తరచుగా చర్చకు వచ్చే అంశాల్లో ముఖ్యమైనది జమిలి ఎన్నికలు. తాజాగా మరోసారి జమిలి ఎన్నికల ప్రస్తావన తెరమీదకి వచ్చింది. అయితే ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయా.. వచ్చే సార్వత్రిక ఎన్నికలు అలాగే జరగనున్నాయా.. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా స్పందించారు.
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమేనని సీఈసీ సునీల్ అరోరా (Sunil Arora) అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యపడుతుందన్నారు. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు సైతం తాము సిద్ధమేనని జాతీయ మీడియాతో మాట్లాడుతూ సునీల్ అరోరా చెప్పారు. అయితే ఒకేసారి ఎన్నికలు జరపాలంటే చట్టాలకు కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read: SBI Cuts Interest Rates: ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఆ లోన్స్‌పై భారీగా తగ్గిన వడ్డీ రేట్లు
దేశంలో ఏదో ఒక చోట జమిలి ఎన్నికలపై తరచుగా చర్చ జరుగుతందని తెలిసిందే. అయితే జమిలి ఎన్నికల నిర్వహణ బాధ్యతలు మాత్రమే తాము చూసుకుంటామని, అందుకు సంబంధించిన నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదన్నారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress) సహా కొన్ని పార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి.
Also Read: Bigg Boss Telugu 4 Grand Finale: Sohel రూ.25 లక్షలు తీసుకుని ఎలిమినేట్ అయ్యాడా! కథ వేరే ఉందా?
కాగా, ప్రధాని నరేంద్ర మోదీ జమిలి ఎన్నికలపై ప్రస్తావించిన కొంతకాలానికే సీఈసీ సునీల్ అరోరా నోటి నుంచి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు అనే మాటలు రావడం ప్రాధాన్యతను పెంచుతుంది. ఒకేసారి ఎన్నికలు ఉంటే పనులలో జాప్యం కూడా తగ్గుతుందని ప్రధాని మోదీ (Narendra Modi)ఇటీవల అభిప్రాయపడ్డారు. తద్వారా ఎన్నికల ఖర్చు సైతం తగ్గుతుందన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook