SBI నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ మరిచిపోయారా.. ఇలా చేయండి
అసలే ఇది కరోనా టైమ్. నెట్ బ్యాంకింగ్ ఉన్నవారికి నగదు బదిలీ చేసుకోవడం, లేక ఇరత్రా పేమెంట్లు చేసేందుకు SBI Net Banking password కావాలి. ఒకవేళ మరిచిపోతే ఇలా రీసెట్ చేసుకోవచ్చు.
SBI Updates | ఇంటర్నెట్ నెట్ బ్యాంకింగ్ ఉన్న ఖాతాదారులకు పాస్‌వర్డ్ మార్చుకునే అవకాశాలన్ని స్టేట్ బ్యాంకు కల్పిస్తోంది. సెక్యూరిటీ కోసం ప్రొఫైల్ వర్డ్ ఉంటుందని తెలిసిందే. పాస్‌వర్డ్ మార్చుకోవాలని ఎస్‌బీఐ తమ నెట్ బ్యాంకింగ్ కస్టమర్తకు సూచిస్తుంటుంది. అదే విధంగా ఎవరికైనా నగదు బదిలీ (మనీ ట్రాన్స్‌ఫర్) చేసే సమయంలో ప్రొఫైల్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. అయితే సెక్యూరిటీ కోసం వాడే ప్రొఫైల్ పాస్‌వర్డ్ మర్చిపోయిన కస్టమర్లకు కొత్త పాస్‌వర్డ్ సెట్ చేసుకునే అవకాశాన్ని నెట్ బ్యాంకింగ్ నుంచి SBI కల్పిస్తోంది. Photos: లేటు వయసులో బికినీ అందాలు
ప్రొఫైల్ పాస్‌వర్డ్ రీసెట్ చేసుకునే విధానం:
1. మొదటగా ఎస్‌బీఐ వెబ్‌సెట్ Onlinesbi.com లో లాగిన్ అవ్వాలి.
2. మై అకౌంట్స్ అండ్ ప్రొఫైల్ (My Accounts & Profile) ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
3. ప్రొఫైల్ ను సెలక్ట్ చేసుకోవాలి
4. మై ప్రొఫైల్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి
5. Forget Profile Password ఆప్షన్‌ను సెలక్ట్ చేయాలి
6. ఆ తర్వాత హింట్ క్వచ్ఛన్ (Hint Question) మీద క్లిక్ చేసి సమాధానం నమోదు చేయాలి.
7. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో కొత్త పాస్ వర్డ్ ఇచ్చి, రీ ఎంటర్ పాస్‌వర్డ్ దగ్గర మీ కొత్త పాస్‌వర్డ్ మరోసారి ఎంటర్ చేయాలి.
8. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే చాలు, మీ కొత్త ప్రొఫైల్ పాస్‌వర్డ్ జనరేట్ అవుతుంది. Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!
ఇకనుంచి మీ ట్రాన్సాక్షన్స్, ఇతర లావాదేవీల సమయంలో ఇప్పుడు క్రియేట్ చేసిన కొత్త ప్రొఫైల్ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి సక్సెస్‌ఫుల్‌గా పని పూర్తి చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయినా, ప్రొఫైల్ పాస్‌వర్డ్ మనల్ని కాపాడుతుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos