Parliament Monsoon Session: పెగసస్ స్పై వేర్ వ్యవహారంపై సద్దుమణగడం లేదు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్షం ఆందోళన చేస్తూనే ఉంది. పెగసస్‌పై చర్చ జరగాలని పట్టుబడుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో(Parliament Monsoon Session)పెగసస్ దుమారం రేగుతోంది. సమావేశాల ప్రారంభం నుంచి పెగసస్‌పై చర్చకోసం ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. పెగసస్ స్పైవేర్ నిఘా వ్యవహారంపై చర్చ, వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల(New Farm Laws)రద్దు డిమాండ్‌తో ప్రతిపక్షాలు వెల్‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. విపక్షాల నిరసన కొనసాగుతుండగానే..లోక్‌సభలో ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లు 2021, ట్రిబ్యునల్ రిఫార్మ్స్ బిల్లు 2021ను ఆమోదం పొందాయి. ప్రతిపక్ష సభ్యులు ఎంతకీ శాంతించకపోవడంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మూడుసార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. 


అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది.పెగసస్ స్పైవేర్(Pegasus Spyware), నూతన వ్యవసాయ చట్టాలపై చర్చ జరగాల్సిందేనని రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. పదే పదే నినాదాలు చేస్తూ సభా వ్యవహారాలకు అంతరాయం కల్గించాయి. ఫలితంగా రాజ్యసభ(Rajyasabha) కూడా పలుసార్లు వాయిదా పడింది. బిల్లుల ఆమోదం విషయంలో ప్రతిపక్ష సభ్యుల అభ్యంతకర వ్యాఖ్యల్ని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తప్పుబట్టారు. సభలో తాము ఏం చేయాలో ఏం చేయకూడదో విపక్షం నిర్దేశించజాలదని రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు(Venkaiah naidu) స్పష్టం చేశారు. 


Also read: కరోనా సెకండ్ వేవ్ ఇంకా తగ్గలేదు: లవ్ అగర్వాల్ హెచ్చరికలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook